నిడమర్రు: కొల్లేరు అభయారణ్య పరిధిలోని నిషేధిత భూముల్లో ఆక్వా సాగు సాగుతోంది. 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ భూముల్లో ఆక్వా సా గు నిషేధం కాగా.. దేవరగోపవరం ఖండ్రిక పరి ధిలో సుమారు 300 ఎకరాల్లో చేపలు, రొయ్యల సా గు యథేచ్ఛగా సాగుతోంది. సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు, అధికారుల మద్దతు ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయా చెరువులకు బహిరంగంగానే విద్యుత్ కూడా సరఫరా అవుతోంది. కొన్నిచోట్ల అనధికార బోర్లు, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ డ్రెయిన్ల నీటితో చెరువులు నింపుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు అంటున్నారు.
ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలి
కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోకి వచ్చే దేవరగోపవరం ఖండ్రిక కోడును ఆనుకుని గతంలో జిరా యితీ పొలాలు ఉండేవి. కొల్లేరు ప్రక్షాళన అనంతరం ఆ భూములను ఆక్వా చెరువులుగా కొందరు పెద్దలు మార్చేశారు. ఈ క్రమంలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఖండ్రిక కోడును ఆక్రమించుకుని చెరువుల్లో కలిపేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరులోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో నీరు ఎగదన్ని తమ పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పెదనిండ్రకొలను, దేవరగోపవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖండ్రిక కోడును ప్రక్షాళన చేసి తిరిగి ఇరిగేషన్ డ్రెయిన్‌గా మార్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా అధికారుల వాదన మరోలా ఉంది. నోటిఫైడ్ డ్రెయిన్లు, నాన్ నోటిఫైడ్ డ్రెయిన్లు 67 ఉండగా వీటిలో ఖండ్రిక కోడు లేదని అంటున్నారు. సదరు డ్రెయిన్‌ను తవ్వాల్సి వస్తే ఇది 5వ కాంటూరు పరిధిలో ఉందని, వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. యంత్రాలతో తవ్వాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని డిప్యూటీసీఎం పవన్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై వివరణలో జిల్లా అధికారులు పేర్కొన్నారు.
యథేచ్ఛగా బోర్లు వినియోగం
5వ కాంటూరులో నుంచి విద్యుత్ సరఫరా నిషేధం. అయినా ఇక్కడ ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా అవుతోంది. చెరువుల వద్దకు నేరుగా తీగల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చెరువుల వద్ద అక్రమ బోర్లు వె లుస్తున్నాయి. ఈ విషయం వన్యప్రాణి సంరక్షణ, అటవీ శాఖ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో అటువైపు చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అటవీ శాఖ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి విద్యుత్ వైర్లను కట్ చేసి చర్యలు తీసుకున్నట్టు హడావుడి చేస్తున్నారు. మరుసటి రోజే విద్యుత్ తీగలను కలిపి విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆక్రమణదారులు చూసుకుంటున్నారు. విద్యుత్ బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడుతున్నా ఏ శాఖ అధికారులూ కన్నెత్తి చూడటం లేదు.
యథేచ్ఛగా ఆక్వా సాగు
5వ కాంటూరులోపు ప్రభుత్వ భూముల కబ్జా!
కాలువల నీటిని చెరువుల్లో నింపుతున్నట్టు ఫిర్యాదులు
అనధికార బోర్లతో ఆక్వా సాగు
కనీసం సర్వే కూడా చేయలేదు
ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలని గతేడాది అక్టోబర్‌లో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేశాను. ఎగువనున్న రైతులు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని, సర్వే చేసి కబ్జాదారుల నుంచి ఖండ్రిక కోడును ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నా. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలని ఫిర్యాదుకు వివరణ ఇచ్చారే తప్ప ఇప్పటివరకూ కనీసం సర్వే కూడా చేయలేదు.
– తుమ్మూరి శ్రీనివాసు, దేవరగోపవరం
కొల్లేరు అభయారణ్యం.. ఆరకమణలే సర్వం
కొల్లేరు అభయారణ్యం.. ఆరకమణలే సర్వం
కొల్లేరు అభయారణ్యం.. ఆరకమణలే సర్వం