7వ తరగతిలోనే పుస్తకాన్ని రాసిన అక్షయనీరెడ్డి
సబితమ్మ మనుమరాలుకు కేటీఆర్ అభినందనలు
సాక్షి, సిటీబ్యూరో: ‘ట్రయల్ ఆఫ్ మిస్‌ఫార్చున్’ అనే పుస్తకాన్ని రాసి అందరి మన్ననలూ పొందుతోంది. ఏడో తరగతి చదువుతున్న అక్షయనీ రెడ్డి పటోళ్ల అతి చిన్న ప్రాయంలోనే ఒక బాలిక చూట్టూ కొనసాగే ఆకర్షణీయమైన కథాంశంతో రాసిన ఈ బుక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ట్రయల్ ఆఫ్ మిస్‌ఫార్చున్’ అనే ఇంగ్లీష్ రచనా సాహిత్యంతో అందరి గుర్తింపు పొందుతున్న అక్షయనీ రెడ్డి.. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మనుమరాలు కావడం విశేషం. ఈ పుస్తకం ఆన్‌లైన్ వేదికగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ పుస్తకానికి సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి కేటీఆర్ ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. అక్షయనీకి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment