‘సి రాఘవాచారి అభిమానులకు విజ్ఞప్తి.. ఆయన వ్యాసాల సమాచారం ఉంటే పంపగలరు’ | C Raghavachari Trustees Urges To Send If Anyone Has His Old Clippings | Sakshi
Sakshi News home page

C Raghavachari: సి రాఘవాచారి అభిమానులకు విజ్ఞప్తి.. ఆయన వ్యాసాల సమాచారం ఉంటే పంపగలరు: ట్రస్టు

Published Thu, Jul 21 2022 10:55 AM | Last Updated on Thu, Jul 21 2022 2:57 PM

C Raghavachari Trustees Urges To Send If Anyone Has His Old Clippings - Sakshi

సుప్రసిద్ధ పాత్రికేయులు, విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి రాఘవాచారి గారి అభిమానులకు, మిత్రులకు విజ్ఞప్తి.. రాఘవాచారి గారు ఎన్నో వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చారు. వివాహాలు చేశారు.  అనేక సంస్థల వారు నిర్వహించిన ఎన్నో సభల్లో ఉపన్యసించారు. ఎన్నో సన్మానాలందుకున్నారు.

బహుశా కొందరైనా వాటిని రికార్డు చేసి భద్రపరచి వుండవచ్చు. మా దృష్టికి రాకుండా వివిధ పత్రికల్లో వారి వ్యాసాలు గాని, వారి కృషి గురించి గాని వ్యాసాలు వచ్చి ఉండవచ్చు. అలా మరుగున ఉండిపోయిన ప్రసంగాల రికార్డింగ్లు, లేదా వ్యాసాల గురించి ఎలాంటి సమాచారం లభించినా సి. రాఘవాచారి ట్రస్టుకు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం. వీలైతే ట్రస్ట్ అడ్రస్ కు పంపవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

పంప వలసిన చిరునామాలు:-
కనపర్తి జ్యోత్స్న
 మేనేజింగ్ ట్రస్టీ
సి.రాఘవాచారి ట్రస్టు
ప్లాట్ నంబర్ 14
నారాయణ స్కూల్
ఎదురు రోడ్డు
మారుతి నగర్
సికింద్రాబాద్ - 11.
ఫోన్: 79818 81912
dmct.vja@gmail.com

బుడ్డిగ జమిందార్,
డోర్ నెం. 54-14/311/A
శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలని
విజయవాడ - 520008
ఫోన్ - 98494 91969
jamindarbuddiga@gmail.com

‘నివాళి’ సంపాదకీయాలు!
ధర్మనిష్ఠకు, వామపక్ష పాత్రికేయ స్ఫూర్తికి నిబద్ధమైన కొండగుర్తు చక్రవర్తుల రాఘవాచారి. శుద్ధ సంప్రదాయ కుటుంబంలో పుట్టి సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని, సంప్రదాయ కళలతో పాటు న్యాయ శాస్త్రాన్ని ఔపోశన పట్టిన సి.రాఘవాచారి ‘నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం’గా తెలుగునాట పేరు గడించారు. జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలను తోసిరాజని విశాలాంధ్ర దినపత్రికకు దాదాపు 3 దశాబ్దాలు సంపాదకునిగా ఉన్నారు.

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కమ్యూనిస్టు నీతికి ఆసాంతమూ కట్టుబడిన రాఘవాచారి కలం నుంచి జాలువారిన సంపాదకీయాలు నేటికీ ప్రామాణికాలని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తొమ్మిది వేలకు పైగా సంపాదకీయాలు వెలువరించారాయన. వీటిలో ఎంపిక చేసిన సంపాదకీయాలను సంపుటాలుగా ప్రచురించే బాధ్యతను సి.రాఘవాచారి ట్రస్టు చేపట్టడం సంతోషదాయకం.

ప్రథమ వర్ధంతి సందర్భంగా సాహిత్యం, సంస్కృతి, కళలపై ఆయన సంపాదకీయాలను మొదటి సంపుటిగా ఆవిష్కరించారు. ‘నివాళి’ సంపాదకీయాలతో కూడిన రెండవ సంపుటిని ట్రస్టు ఇటీవల వెలువరించింది. కమ్యూనిస్టు యోధుడు భవానీసేన్‌  మొదలుకొని, నీలం రాజశేఖరరెడ్డి వరకు.. 112 నివాళి సంపాదక వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి.

‘‘ఈ నికృష్ట పరిస్థితుల నిర్మూలనకూ, అన్ని రకాల దోపిడీ అంతానికి దీక్షాధారులై చైతన్యంతో ఉద్యమించడం అంబేద్కర్‌ స్మృతికి మనం అర్పించగల నిజమైన శ్రద్ధాంజలి! ఇతరాలన్నీ శుష్క లాంఛనాలు!’’ అంటూ రాఘవాచారి అంబేద్కర్‌కు 32 ఏళ్ల క్రితం అక్షర నివాళులర్పించారు. రాజకీయ, చారిత్రక అంశాల అధ్యయనంపై ఆసక్తి గల వారికి సి. రాఘవాచారి సంపాదకీయాల మొదటి, రెండవ సంపుటాలు విజ్ఞాన గనులే! – పంతంగి రాంబాబు

నివాళి – ‘విశాలాంధ్ర’ రాఘవాచారి సంపాదకీయాలు 
(రెండో సంపుటి)
ప్రచురణ: సి.రాఘవాచారి ట్రస్ట్‌ 
పేజీలు: 295
వెల : రూ. 200
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌ హౌస్, నవచేతన బుక్‌ హౌస్, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు / బుడ్డిగ జమిందార్‌ (విజయవాడ), మొబైల్‌: 98494 91969 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement