టెక్నాలజీతో పరిచయం ఉన్నవాళ్లకు పాడ్‌కాస్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. ఒక సీరిస్‌లాగా కంప్యూటర్ లేదా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వీలుండే డిజిటల్ ఆడియో ఫైల్స్‌ను పాడ్‌కాస్ట్ అంటారు. ఆయా దేశాల్లో వివిధ అంశాలపై పాడ్‌కాస్ట్స్‌ను రిలీజ్ చేస్తుంటారు. ప్రముఖులు రిలీజ్ చేసే పాడ్‌కాస్ట్స్‌కు ఆదరణ ఎక్కువగా లభిస్తుంటుంది. అయితే ఇటీవల కాలంలో పాశ్చాత్య సమాజంలో కొత్త తరహా పాడ్ కాస్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. దయ్యపు కథలు, హారర్ ప్రదేశాలు, దయ్యాల వేటగాళ్ల గురించిన కథలుండే పాడ్‌కాస్ట్స్‌కు అమెరికా తదితర దేశాల్లో భారీగా ఆదరణ లభిస్తోంది.
10మందిలో నలుగురు అమెరికన్లు దయ్యాలున్నాయని నమ్ముతారని యూగవ్ సర్వే చెబుతోంది. సమాజంలో ఈ నమ్మకమే హారర్ పాడ్‌కాస్ట్స్ డిమాండ్ పెంచుతోంది. ఇలా పాపులరైన కొన్ని పాడ్ కాస్ట్స్ వివరాలు.. రియల్ ఘోస్ట్ స్టోరీస్ ఆన్‌లైన్: రోజూ పలు పారానార్మల్ కథలను ప్రసారం చేస్తుంది. ఈ అంశాలు అనుభూతి చెందిన ప్రజల అనుభవాలను వారి నోటితోనే వినిపిస్తుంది. వినేవాళ్లు కావాలంటే తమ సొంత దయ్యపు కథలను అప్ లోడ్ చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు bit.ly/36n20vb లో ట్రై చేయవచ్చు.
- హంటెడ్ ప్లేసెస్: భూగ్రహంపై అత్యంత భయానక ప్రదేశాల గురించి వివరాలు ఇస్తుంటుంది. పలు హాంటెడ్ స్థలాల గురించి హోస్ట్ గ్రెగ్ పాల్సిన్ భయంకరంగా వర్ణిస్తారు. ప్రతి గురువారం ఒక కొత్త ప్రదేశం గురించిన కథ ఉంటుంది. మీరు కూడా వినాలనుకుంటే parcast.com/haunted లో ప్రయత్నించవచ్చు.
- రియల్ లైఫ్ ఘోస్ట్ స్టోరీస్: దయ్యం పట్టి వదిలిన వాళ్లు, వారి సంబంధీకుల కథలను ప్రసారం చేస్తుంది. కావాలంటే stitcher.com/show/real&life&ghost&storie లో వినవచ్చు.
- అన్‌ఎక్స్‌ప్లైన్డ్: రెండువారాలకు ఒకమారు ప్రసారమయ్యే ఈ సీరిస్‌లో అంతుచిక్కని మార్మిక కథల లోగుట్టు వివరించే యత్నం చేస్తారు. అలాగే అర్థం కాని, ఆన్సర్ లేని పారానార్మల్ అంశాలను వినిపిస్తారు. ఆసక్తి ఉంటే unexplainedpodcast.com/ లో ట్రై చేయండి.
Comments
Please login to add a commentAdd a comment