పురాతన ఆలయం కోతులకు ఆవాసం! | Galtaj An Ancient Temple Known As Monkey Temple In The Aravallis | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయం కోతులకు ఆవాసం!

Published Sun, Oct 29 2023 8:14 AM | Last Updated on Sun, Oct 29 2023 8:14 AM

Galtaj An Ancient Temple Known As Monkey Temple In The Aravallis - Sakshi

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గల్తాజీ’ పీఠం మర్కట మందిరంగా పేరుమోసింది. ప్రతిరోజూ ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలసిన విలక్షణ ఆలయం ఇది.

ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటికుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. విశిష్టాద్వైత స్థాపకుడైన రామానుజాచార్యుల పరంపరకు చెందిన గల్తాజీ ఇక్కడ పదిహేనో శతాబ్దిలో రామానుజ సంప్రదాయం ప్రకారం వైష్ణవ పీఠాన్ని నెలకొల్పారు. ఉత్తర భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఏర్పడిన తొలి పీఠం ఇదే! ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా, ఈ ప్రాంగణంలోనే సూర్యాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపించే మర్కట సమూహాలు ఆనాటి వానర సేనల వారసులేనని భక్తులు నమ్ముతారు. 

(చదవండి: తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement