దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉండటంతో అది ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. అన్నిటికంటే ముఖ్యంగా గుండెజబ్బులను దానిమ్మ నివారిస్తుందన్నది కూడా తెలిసిన విషయమే. అయితే ఒంటి బరువు పెరగకుండా నివారించడానికీ, ఒబేసిటీ రాకుండా నియంత్రించుకోడానికి కూడా దానిమ్మ సహాయపడుతుంది. అంటే కొంతవరకు కష్టమైన వ్యాయామాలు చేయనక్కర్లేకుండానే తియ్యటి పండు తింటూ, సంతోషంగా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట.
దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం ఏమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉంటుంది. అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికి తోడు మంచి ఆరోగ్యాన్ని సమకూర్చే అనేక పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. దీనితో ప్రయోజనాలు అపరిమితం. దానిమ్మలో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతో పాటు పొటాషియమ్ వంటి అనేక లవణాలు ఉంటాయి. దాదాపు 25 గ్రాముల చక్కెర కలిగి ఉండి ఒక పండులో 144 క్యాలరీల శక్తి ఉంటుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు కలిగి ఉన్నందున బరువు తగ్గడంలో దానిమ్మ సమర్థంగా ఉపయోగపడుతుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment