
ప్రతీకాత్మక చిత్రం
ఆస్తమా ఉన్నవారికి డాక్టర్లు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేస్తుంటారు. వీటిపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా మందును ఊపిరితిత్తులోకి పీలుస్తుండాలి కాబట్టి... వాటితో ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు, పసివాళ్లకు అవి మంచివేనా అంటూ సందేహ పడుతుంటారు. నిజానికి ఇన్‌హేలర్స్ చాలా సురక్షితం. ఓ మందును మింగడం వల్ల అది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా... మిగతా అన్ని అవయవాల కణాలకూ చేరుతుంది.
కానీ ఇన్‌హేలర్స్ కేవలం సమస్య ఉన్న చోటే చికిత్స జరిగేలా చూస్తాయి. ఇన్‌హేలర్స్‌లో వాడే మందు మోతాదు కూడా చాలా తక్కువ. ఇది మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ముఖ్యంగా టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇది మరీ మరీ తక్కువ. ఇక స్పేసర్ డివైజ్ వాడితే... మందు ఏమాత్రం వృథా కాదు. అందుకే... ఎలాంటి అపోహలూ లేకుండా ఇన్‌హేలర్స్ వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల...
Comments
Please login to add a commentAdd a comment