ఎంతోమంది విదేశాలకు వెళ్లిన తర్వాత పుట్టి పెరిగిన ప్రాతాన్ని మర్చిపోతుంటారు. కాని కరీంనగర్ నుంచి అమెరికా వెళ్లి అక్కడ నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడి కుమార్తె సొంత ఊరిపై మమకారంతో అనాథ విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి అందించింది. ఈ రకంగా తన తల్లితండ్రులు పెరిగిన ఊరిపై ప్రేమను చాటుకుంది.
కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయులు లక్కాకుల వినయ్ అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తుండగా వారి కూతురు లక్కాకుల హరిణి అమెరికాలోని నోవి హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. హరిణి ΄ాఠశాల సామాజిక సేవాకార్యక్రమంలో భాగంగా రూ.1.65 లక్షల మేరకు విరాళాలు సేకరించింది.
ఈ మొత్తాన్ని హరిణి కరీంనగర్ పట్టణంలోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులంలో 40 మంది అనాథ విద్యార్థులకు విద్యాబుద్ధులను గరపడంతో΄ాటు సకల సౌకర్యాలను కలుగజేస్తున్నారని తెలుసుకొని వారి అవసరాల కోసం విరాళంగా ఇచ్చారు. వయసులో చిన్న అయినా, పెద్ద మనసుతో విరాళాలు సేకరించి ఇచ్చిన హరిణికి బాలగోకులం విద్యార్థులు, వెంకట్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment