
వెల్లుల్లి పేస్టు తెలుసు కానీ ఈ పొడి తెలుసా?
- అరకిలో వెల్లుల్లి రెబ్బలను పొట్టు వొలిచి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. కప్పు బొంబాయి రవ్వను బాణలిలో వేసి, వేడెక్కిన తరువాత రవ్వలో వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. రవ్వ, వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు వేయించి దించేయాలి. వెల్లుల్లి ముక్కలను రవ్వ నుంచి వేరుచేసి మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి.
- ఈ పొడిని పిండి జల్లెడతో జల్లించుకుని గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకుంటే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఇలా చేసుకుంటె మార్కెట్లో వెల్లుల్లి పొడి కొనే అవసరం ఉండదు. వెల్లుల్లి పేస్టుకు బదులు ఈ పొడిని కావాల్సిన కూరల్లో వేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే తరచూ వెల్లుల్లి పొట్టు తీసి దంచే పని ఉండదు.
ఇంట్లో అల్లం ఎక్కువగా ఉందా? ఇలా చేయండి - అన్నం మాడిపోతే ఒక ఉల్లిపాయను తీసుకుని నాలుగు ముక్కలుగా తరగాలి. మాడిన అన్నం గిన్నె మధ్యలో నాలుగు ముక్కలను నాలుగు చోట్ల పెట్టి పదిహేను నిమిషాల పాటు మూతపెట్టి ఉంచాలి. పావు గంట తరువాత మూత తీసి ఉల్లిపాయ ముక్కలను తీసేయాలి. ఇలా చేయడం వల్ల మాడు వాసన పోతుంది. అన్నం ఉల్లిపాయ వాసన కూడా రాకుండా చక్కగా ఉంటుంది.
- ఇంట్లో అల్లం ఎక్కువగా ఉన్నప్పుడు... తొక్కతీసి కొద్దిగా నూనె వేసి పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టుని ఐస్ ట్రేలో వేసుకుని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ అల్లం క్యూబ్స్ ఎప్పుడంటే అప్పుడు సులభంగా వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment