
ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ సింగ్ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్ తెలిపారు. హెక్టారుకు 36 క్వింటాళ్ల కందుల దిగుబడినిచ్చే ఈ రకం యూపీతోపాటు బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందిందన్నారు. భూతాపం వల్ల మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ రకం రైతులకు స్థిరమైన భరోసానిస్తుందని కుద్రత్–3 ఆవిష్కర్త రఘువంశీ అంటున్నారు. దీని పంటకాలం 235 రోజులు. వంద గింజల బరువు 17.57 గ్రాముల బరువు తూగుతాయి. వివరాలకు.. ప్రకాశ్ సింగ్ రఘువంశీ – 98392 53974, 70203 07801.
Comments
Please login to add a commentAdd a comment