
ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...
నా పూర్వజన్మ సుకృతం
ప్రతిసారీ ప్రవచనం చెప్పడం నాకొక గొప్ప పరీక్ష. ఆ పరీక్షే నాకు చాలా అనందాన్నిచ్చేది. విస్తృతంగా గ్రంథ పఠనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆవళింపు చేసుకున్న విషయాన్ని సభాముఖంగా సుస్పష్టంగా వివరిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించడం ప్రవచనకారిణిగా నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. ఎంతోమంది ప్రఖ్యాత ప్రవచనకారుల ఉపన్యాస వైదుద్యాన్ని తెలుసుకోవడం కోసం వీలున్నప్పుడల్లా వారి ఉపన్యాసాలు వినేదాన్ని.
ఇంకొక విషయం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించిన ప్రవచన వేదికలన్నీ చాలా శక్తివంతమైనవి. ఎన్నో దేవాలయ ప్రాంగణాలు, ఎన్నో ధార్మిక సంస్థల వారి వేదికలు, మరెన్నో ప్రాచుర్యం వహించిన ఆధ్యాత్మిక స్థలాలు నాకు చేయూతనిచ్చాయి. కాలం మారింది. నేడు ఎందరో యువతీయువకులు ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు.
నా ప్రవచనం పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి ‘‘అమ్మా! మీరు చెబుతున్న విషయాలు బాగున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి ? ఏ ఏ గ్రంథాలయాలలో పుస్తకాలు కోసం వెదకాలి. అని అడుగుతుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నాకు సాధ్యమైనంతవరకు వారికి తగిన మార్గాన్ని సూచిస్తుంటాను.
– డాక్టర్ దుర్భాకుల హేమ
Comments
Please login to add a commentAdd a comment