జెంటిల్మన్ అనగా ఎవరు? కొండను పిండి చేసి ఆ పిండితో వేడివేడి రొట్టెలు తయారుచేసేవారా? సూపర్‌మెన్‌లా గాలిలో ఎగిరి దూకేవాళ్లా? కానే కాదు అంటుంది ప్రముఖ మెన్స్ గ్రూమింగ్ బ్రాండ్ ‘ది మ్యాన్ కంపెనీ’. జెంటిల్‌మన్ ఎక్కడి నుంచైనా రావచ్చు...దేశాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు ఏవీ అడ్డుకావు అంటుంది. ‘మెన్స్ డే’ను పురస్కరించుకొని ‘తుమి తో హో’ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఆకట్టుకునే వీడియోను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ...భాషల్లో యూట్యూబ్‌లో విడుదల చేసింది.
ఇంతకీ జెంటిల్‌మన్ ఎవరు?
ఎవరైతే నిరాశావాదాన్ని చెంతకు రానివ్వరో, ఎవరైతే నిత్యసంతోషంతో వెన్నెల నవ్వులతో వెలిగిపోతారో, ఎవరైతే మంచిని చెలిమి చేసుకుంటారో, సమాజానికి మంచి చేస్తారో, ఎవరైతే కొండంత ఆత్మవిశ్వాసంతో ఉట్టిపడతారో, కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలుస్తారో...వారే జెంటిల్‌మన్.
2019 ‘మెన్స్ డే’ సందర్భంగా వచ్చిన ‘జెంటిల్మన్ కైసే కెహ్తే హై’కు ఈ క్యాంపెయిన్ కొనసాగింపు.
‘మనం రోజూ ఎంతోమంది జెంటిల్మన్‌లను చూస్తుంటాం. ఎందుకోగానీ వారి జెంటిల్‌నెస్ మనకు కనిపించదు. వారి అంతర్, బహిర్ సౌందర్యాన్ని కవిత, పాటల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అంటుంది మ్యాన్ కంపెనీ.
అంతే కదా మరీ!
Comments
Please login to add a commentAdd a comment