
చంటిపిల్లలతో ప్రయాణాలు అంటే తల్లిదండ్రులకు కష్టమే. ఏమాత్రం అసౌకర్యం అనిపించినా చాలు వెంటనే ఏడుపు మొదలెట్టేస్తారు చిన్నారులు. ఆ చికాకులో నచ్చిన బొమ్మలు ఇచ్చినా విసిరి అవతల పారేస్తారు. వారిని ఊరుకోబెట్టాలంటే ఒక్కోసారి తలప్రాణం తోకకు వస్తుంది. సొంత వాహనాలు ఉన్నవాళ్లు కాసేపు ఆగైనా సరే.. వారిని శాంతపరిచి ముందుకు సాగవచ్చు. ఏ బస్సో, రైలో ఎక్కినా కాస్త పర్లేదు. మధ్యలో దిగిపోయినా పెద్దగా నష్టం ఉండదు. అదే విమానమైతే ఇలాంటి వెసలుబాట్లు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఓ కుటుంబానికి!
గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లాడిని ఊరుకోబెట్టడం ఎవరి వల్లా కాలేదు. అంతలో రంగంలోకి దిగింది ఫ్లైట్ అటెండెంట్. ఆడుకోవడానికి అతడికి బొమ్మలు ఇచ్చింది. కాసేపు కబుర్లు చెప్పింది. అయినా, ఆ బుడ్డోడు ఊరుకుంటేనా! ఇక లాభం లేదనుకుని వాడిని భుజాన వేసుకుని లాలించింది. తల్లిలా అక్కున చేర్చుకుని తన ఆత్మీయ స్పర్శతో ఊరట కలిగించింది.
కాసేపటి తర్వాత ఆ పిల్లాడు ఏడుపు ఆపి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని బ్రెసీలియా నుంచి కుయీబా పట్టణానికి వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అరె మంత్రం వేసినట్లుగా ఆ పిల్లాడు నిద్రపోయాడు. నిజంగా మీరు గ్రేట్. తల్లి ప్రేమను పంచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓ మహిళ.. మాక్కూడా విమాన ప్రయాణంలో ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. అప్పుడు నేను ఏడు నెలల గర్భవతిని. ఫ్లైట్ అటెండెంట్ నా బిడ్డను గంటల పాటు ఎత్తుకుని ఆడించారు. వారి వల్లే నాకు కాస్త ఉపశమనం దొరికింది. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ తన అనుభవాన్ని కామెంట్
రూపంలో తెలియజేసింది.
చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
Comments
Please login to add a commentAdd a comment