ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కొత్త అంతర్జాతీయ భద్రత బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం– ఇకముందెవ్వరూ పోలీసుల తాలూకు దృశ్యా లను చిత్రీకరించి, వారి శారీరక లేదా మానసిక స్థితిని దెబ్బతీయరాదు. అంటే పోలీసులు విధి నిర్వహణలో నిబంధనలను అతిక్ర మించి హింసాత్మకంగా ప్రవర్తించినా, పాత్రికేయులు గానీ, ప్రజలు గానీ వీడియోల చిత్రీకరణలు చేసి ప్రచా రంలో పెట్టరాదు. అంతిమంగా ఇది పోలీసులకు రక్షణ కల్పించే పేరిట, ప్రజలపట్ల వారు అతిగా వ్యవహ రించడానికి లైసెన్స్ ఇచ్చే విధంగా ఉంది.
కాగా ఈ బిల్లు చట్టం కావడానికి వ్యతిరేకంగా – ఫ్రెంచ్ ప్రజలు, పాత్రికేయులు రోడ్లెక్కారు. అది పాత్రి కేయుల హక్కులను, ఫ్రెంచ్ విప్లవ నినాదమైన ‘లిబర్టీ’ (స్వేచ్ఛ)ని కాలరాసే విధంగా ఉందని నినది స్తున్నారు. మాటల్లో తప్పితే చేతల్లో స్వేచ్ఛ కనబడని పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కార్ల్ మార్క్స్ 19వ శతాబ్దంలోనే చెప్పివున్నాడు. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవ నినాదం ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’. దీనిని మార్క్స్– పెట్టుబడిదారులు ‘స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం’ అని నినదిస్తారు కానీ నిజానికి ఆ నినాదసారం ‘పదాతి దళం, ఫిరంగి దళం, అశ్విక దళం’ అని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం, ఫ్రాన్స్ నల్లచట్టం పరిస్థితి నిరూపి స్తుంది ఇదే.
గత అనేక సంవత్సరాలుగా ఫ్రెంచ్ ప్రజలు, ప్రపంచంలోని అనేక ధనిక దేశాల ప్రజల్లా గానే పదే పదే నిరసనలకూ, వీధి పోరాటాలకూ దిగుతున్నారు. ఈ క్రమంలో, పరిస్థితి మరింత చేయి జారిపోతున్నట్లు– పాలకవర్గాలు భావిస్తున్నాయి. వ్యవస్థలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అసమాన తలు– కోవిడ్ అనంతర కాలంలో మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో అటు ఫ్రాన్స్, ఇటు ఇతర ధనిక దేశాల్లోని పాలకులు కూడా తమ ముసుగులను తీసే స్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రజానీకం మీద బహిరంగం గానే దాడికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తమ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక పునాదులకు మూల మైన ఫ్రెంచ్ విప్లవ నినాదాన్ని కూడా పాలకులు పాతర పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు ఈ అసలు రూపాన్ని రష్యా విప్లవ నేత లెనిన్ కొన్ని ప్రశ్నల రూపంలో వివరించారు. మొదటగా, ‘స్వేచ్ఛ’ అనే దానిని వివరిస్తూ, స్వేచ్ఛ ఎవరికీ, ఎవరి నుంచీ అనే ప్రశ్న వేశారు. స్వేచ్ఛ అనే పదాన్ని వాస్తవ జీవితంతో సంబంధం లేకుండా వాడలేమనీ, అనివార్యంగా ఇది రెండు భిన్న వర్గాలను దృష్టిపథంలోకి తెస్తుందనీ ఆయన ఉద్దేశం. రెండు వర్గాలు లేకుండా, ఒకరిపై ఒకరి పెత్తనాలు లేకుండా– విడిగా స్వేచ్ఛ అంటూ ఉండదనేది ఇక్కడ గమనార్హం.
ఇక్కడ ‘సమానత్వం ఎవరికీ, ఎవరినుంచీ’ అని లెనిన్ ప్రశ్నిస్తాడు. సమా నత్వం అనే నినాదమే అసమానుల అస్తిత్వాన్ని సూచి స్తోంది. అసమానులు (ఆర్థిక అసమానతలతో సహా) లేని సమాజంలో, సమానత్వం అనే అంశం తాలూకు అస్తిత్వమే ఉండదు. ఇక ఈ మాటల్లో చివరిది ‘సోదర భావం’. ‘సోదరభావం ఎవరెవరి మధ్య’ అని కూడా లెనిన్ ప్రశ్నించాడు. వర్గాలుగా విడిపోయిన సమా జంలో స్వేచ్ఛను కోల్పోయిన వారికీ, ఆర్థిక అసమాన తల కింద కునారిల్లుతున్న బడుగులకూ– తమను అణ చివేసి, తమ శ్రమశక్తితో ఆర్థికంగా ఎదిగిన పై వర్గాల వారితో సోదరభావం సాధ్యం కాదనేది సారాంశం.
ఈ కోణం నుంచి ఫ్రాన్స్, ఇతర దేశాల పరిణామా లను గమనిస్తే, వాస్తవంలో జరుగుతున్నది ఏమిటో అర్థమవుతుంది. అంతర్జాతీయంగా ఫ్రెంచ్ విప్లవ నినాదంతో ప్రభావితం అయ్యామని చెప్పుకుంటున్న వివిధ దేశాలలో ఈ నినాదం తాలూకు హక్కులూ, ఆ హక్కులకు హామీ ఇచ్చే ప్రాథమిక చట్టాలూ కూడా వారికి భరించనలవికానివిగా తయారయ్యాయన్న మాట. ఇగిరి ఆవిరైపోతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు అంతిమ ఫలితం ఇది. నిన్నటివరకూ లాగా, కనీస స్థాయిలో ప్రజలకు రాయితీలు ఇచ్చిన స్థితి కూడా పోయి, ఇక నేడు ప్రజల కడగండ్లు పెరుగుతున్న కాలంలో తాము చేసిన చట్టాలను తామే భరించలేని స్థితికి పాలకులు చేరుకున్నారు.
వివిధ దేశాలలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతల వల్ల రానున్న రోజుల్లో ఫ్రాన్స్ తాలూకు ఈ ‘అంతర్జాతీయ భద్రతా బిల్లు’ విశ్వవ్యాప్త మైనా ఆశ్చర్యంలేని పరిస్థితి. నాడు పెట్టుబడిదారీ ప్రపంచానికి ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ నినాదాన్ని అందించిన ఫ్రాన్స్ నుంచి మళ్ళీ మరింత ఉధృత రూపంలో ఇటువంటి చట్టం మొలకలెత్తడం కాలం తాలూకు వైచిత్రి కావచ్చు!
వ్యాసకర్త: డి. పాపారావు, సామాజిక విశ్లేషకులు
మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment