వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం

Published Fri, Feb 21 2025 8:51 AM | Last Updated on Fri, Feb 21 2025 8:46 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురిని పార్టీ అనుబంధ విభాగాల కమిటీ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన శేషగిరి పవన్‌కుమార్‌, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఉట్ల పాలశ్రీనివాసరావు, సాంస్కాృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన చెరుకూరి సాంబశివరావు, ఇంటలెక్చువల్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఈమని రాఘవరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వీరిశెట్టి సుబ్బారావు, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన మేడా వెంకటేశ్వరరావు, వలంటీర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉద్దగిరి మురళిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అమరేశ్వరుని సేవలో మంత్రి సుభాష్‌

అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామివారి శేష వస్త్రంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్‌కుమార్‌, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

క్వారీ ప్రాంతాన్ని

పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

వీరనాయకునిపాలెం(చేబ్రోలు): గ్రామంలో మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహా గురువారం పరిశీలించారు. గ్రామానికి చెందిన కొందరు నిర్వహించిన అక్రమ క్వారీయింగ్‌పై గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలో జరిగిన మైనింగ్‌పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని రెవెన్యూ, మైనింగ్‌ శాఖాధికారులను కోర్టు ఆదేశించింది. గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు 32 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం అందజేసింది. దళితులకు అందజేసిన భూమిలో కొందరు నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీయింగ్‌ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎంతమేర మైనింగ్‌ జరిగిందనే దానిపై రెవెన్యూ, సర్వేయర్లతో నివేదికను తయారు చేస్తున్నారు. దీనిపై సిబ్బందికి సబ్‌ కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామానికి చెందిన పలువురు సబ్‌ కలెక్టర్‌కు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ, మండల సర్వేయర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

1,37,523 బస్తాల

మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం 1,29,446 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,37,523 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 67,713 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం    1
1/2

వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం

వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం    2
2/2

వైఎస్సార్‌ సీపీ ‘అనుబంధ’ అధ్యక్షుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement