11 మంది రెవెన్యూ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

11 మంది రెవెన్యూ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు

Published Fri, Feb 21 2025 8:51 AM | Last Updated on Fri, Feb 21 2025 8:51 AM

-

మార్టూరు: జిల్లా వ్యాప్తంగా కొందరు రెవెన్యూ సిబ్బందికి గురువారం జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు ఇటీవల ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా? తీసుకున్నారా? అంటూ ప్రభుత్వం తరఫున ఫోన్‌ ద్వారా ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 11 మంది రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. వారిలో అత్యధికంగా మార్టూరు మండలం నుంచి ఐదుగురు వీఆర్వోలు ఉండటం విశేషం. మండలంలో షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారిలో ద్రోణాదుల–2, కోలలపూడి, జొన్నతాళి, బొబ్బేపల్లి, మార్టూరు– 3 వీఆర్వోలు కే మోహన్‌ నాయక్‌, జి.వీరయ్య, ఎ. ఉమామహేశ్వరరావు, జి.రోశయ్య, కె.మోహనరావులు ఉన్నారు. మిగిలిన ఆరుగురిలో నగరం మండలం ధూళిపూడి గ్రామ సర్వేయర్‌ ఎం. గోపి నాగకృష్ణ, భట్టిప్రోలు వీఆర్‌ఓ ఎం.లక్ష్మి, అద్దంకి వీఆర్వో ఎం.శ్రీనివాసరావు, ఇంకొల్లు వీఆర్వో ఎం. సురేష్‌ ఉన్నారు. పర్చూరు మండలం ఉప్పుటూరు వీఆర్వో పి. నాగలక్ష్మి, జే. పంగులూరు మండలం రేణింగివరం వీఆర్వో వి. సుమతి షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరిని మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ కలెక్టర్‌ గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు.

ఐవీఆర్‌ఎస్‌ సర్వే లోపభూయిష్టం..

ఇదిలా ఉండగా ఈ విషయమై జిల్లాలోని కొందరు వీఆర్వోలు విలేకరులతో మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్‌ సర్వే లోపభూయిష్టంగా ఉందన్నారు. దరఖాస్తు చేయని వారికి ఫోన్‌ చేసి ఒకటి నొక్కమని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందే బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైళ్లు రద్దు

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ మీదుగా వెళ్లే చర్లపల్లి–దానాపూర్‌–చర్లపల్లి రైళ్లను కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌ గురువారం తెలిపారు. చర్లపల్లి నుంచి దానాపూర్‌కు ఈనెల 21 నుంచి 28 వరకు నడపదలిచిన ప్రత్యేక రైలుతోపాటు దానాపూర్‌ నుంచి చర్లపల్లి వరకు ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు నడపదలిచిన ప్రత్యేక రైలును రద్దు చేసినట్టు వివరించారు.

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అవినీతి

ఆరోపణలే కారణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement