పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): భక్తుల కోరిక మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కుంభామేళాకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ స్పెషల్ హైటెక్ బస్సు బయలుదేరనుంది. మొత్తం 8 రోజుల ప్రయాణంలో భాగంగా అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి ప్రాంతాలను సందర్శించేలా ఈ సర్వీసుకు రూపకల్పన చేశారు. ఉదయం 10గంటలకు బస్సు బయలుదేరనుంది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోదలచిన వారు 91927 సర్వీస్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో టికెట్ ధర రూ.8,300గా నిర్ణయించారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులదే. వివరాల కోసం 7382897459, 7382896403 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment