దమ్మాలపాడు (ముప్పాళ్ళ): గ్రామాల్లో జరుగుతున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.రవి చెప్పారు. దమ్మాలపాడు గ్రామంలో ఫ్రైడే– డ్రైడే కార్యక్రమాన్ని, ఎన్‌సీడీ– సీడీ సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా పంచాయతీ సిబ్బందితో పని చేయించాలన్నారు. రోడ్ల వెంబడి చెత్త లేకుండా చూడాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేలో భాగంగా ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మార్చి 30వ తేదీ నాటికి సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్, సీహెచ్‌ఓ హర్షవర్ధన్, ఆరోగ్య పర్యవేక్షకుడు ఎ.పీటర్ డేమియన్, ఎస్‌కే రహిమాన్, ఏఎన్‌ఎం మస్తాన్‌బీ, ఆశా కార్యకర్తలు సుభాన్‌బీ, సుబ్బమ్మ, కుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment