పెండ్లికుమారుడైన అమరేశ్వరుడు
అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం అర్చకులు అమరేశ్వరుడిని, బాల చాముండేశ్వరి దేవిని పెండ్లి కుమారునిగా, పెండ్లి కుమార్తెగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు కై తేపల్లి సుధీర్‌శర్మ ఆధ్వర్యంలో శివరాత్రి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్తల మండలి చైర్మన్ రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్ తరఫున పీసపాటి అమరేశ్వర శర్మ నేతృత్వంలో స్వామి వారికి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి కళ్యాణోత్సవ వస్త్రాలను సమర్పించారు. స్వామి వారికి వేకువజామున అభిషేకం నిర్వహించి, నూతన వస్త్రధారణతో పెండ్లికుమారుడిని చేశారు. క్రోధినామ సంవత్సర మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ కళ్యాణోత్సవాలకు అర్చకులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి సునీల్‌కుమార్ దీక్షా వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
హైవేపై వాటర్
ట్యాంకర్ బోల్తా
విజయపురిసౌత్: ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి వాటర్ ట్యాంకర్ హైవేపై బోల్తా పడిన సంఘటన మాచర్ల మండలం భైరవునిపాడు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాచర్ల నుంచి నీటిని నింపుకొని 7వ మైలుకు వెళ్తున్న వాహనం సరిగ్గా భైరవునిపాడు వద్దకు రాగానే గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అనంతరం క్రేన్‌తో రోడ్డుకు అడ్డుగా పడ్డ వాహనాన్ని తొలగించారు. డ్రైవర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
శివరాత్రికి
పటిష్ట బందోబస్తు
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు తెలిపారు. స్థానికంగా శివరాత్రి ఏర్పాట్లను, భద్రత కల్పించాల్సిన స్థలాలను ఆదివారం ఆయన పరిశీలించారు. సుమారు 150 మంది సిబ్బంది, 20 మంది అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఎస్పీ వెంట అమరావతి సీఐ అచ్చియ్య, ఎస్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.
రుద్రాక్ష వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం 6వ రోజు స్వామి వారు రుద్రాక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహేష్ కుమార్ శర్మ, శ్యామ సుందర శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పట్టణానికి చెందిన ఉదయ్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఉదయ కుమార్, శ్రీరంగ సత్యనారాయణ, బాలగంగాధర్‌గుప్తా, శివమోహన్‌మూర్తి, సురేంద్రబాబు, పెదబాబు, శివప్రసాదరావుగుప్తా, రవీంద్రనాథ్‌గుప్తా, అశ్వనీ కుమార్, గోపాలకృష్ణ, మధుసూదన వెంకట సుబ్బారావు, చెన్న కేశవ శేషగిరిరావు ఉత్సవ కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన ఈవో జె.వి. నారాయణ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.
పెండ్లికుమారుడైన అమరేశ్వరుడు
పెండ్లికుమారుడైన అమరేశ్వరుడు
Comments
Please login to add a commentAdd a comment