అర్ధరాత్రైనా అతివకు అండ
నగరంపాలెం: ఈ నెల 4వ తేదీన బ్రాడీపేటకు చెందిన మహిళ తమ ఇద్దరు పిల్లలతో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో గుంటూరు బయలుదేరారు. గుంటూరు స్టేషన్‌కు అర్ధరాత్రి దాటాక రైలు చేరింది. ప్లాట్‌ఫాం నుంచి బయటకొస్తే ఎలాంటి వాహనాల్లేవు. ‘మీ కోసం’ నంబర్‌కు ఆమె కాల్ చేయగా.. కొత్తపేట పీఎస్ ఎస్‌ఐ తరంగణి వెంటనే మొబైల్ పోలీస్ వాహనంతో స్టేషన్‌కు చేరుకున్నారు. మహిళ, ఇద్దరు పిల్లలను పోలీస్ వాహనంలో బ్రాడీపేటలోని ఇంటి వద్దకు చేర్చారు. దీనిపై సదరు మహిళ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
నల్లపాడు పీఎస్ పరిధిలోని ప్రైవేటు కళాశాలలో ఓ విద్యార్థిని నర్సింగ్ చదువుతోంది. సమీప బంధువే ఆమెను లైంగికంగా వేధించేవాడు. దీంతో ఆమె ‘మీ కోసం’ నంబర్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఆకతాయిని పిలిపించి తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఫోన్ చేస్తే చాలు..
గతేడాది నవంబర్ 25వ తేదీన ‘మహిళా.. మీ కోసం’ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అమల్లోకి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో మహిళలను ఇంటికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేనప్పుడు సాయం చేయాలని నిర్ణయించారు. ఎవరైనా, ఎలాంటి ఆపదలోనైనా ఉంటే 97464 14641 నంబర్‌కు చేసి పోలీస్ సాయం పొందవచ్చు. ఈవ్‌టీజింగ్‌కు గురైనా, కుటుంబసభ్యులు వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, బెదిరించినా ఈ నంబర్‌కు కాల్ చేయొచ్చు. బాధితుల నుంచి కాల్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరేందుకు అనువుగా మొబైల్ పోలీస్ వాహనాలు, బైకులు కేటాయించారు. కానిస్టేబుళ్లు నిత్యం విధుల్లో ఉంటారు. మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 86 కాల్స్ వచ్చాయి. జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, తెనాలి రైల్వేస్టేషన్ల నుంచి, గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎక్కువ మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దాదాపు 19 మంది మహిళలు, విద్యార్థినులు ఇలా ఇళ్ల వద్దకు భద్రంగా చేరుకున్నారు. మహిళా ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు వీరికి సాయంగా ఉంటున్నారు.
ఆకతాయిలకు కౌన్సెలింగ్..
కొత్తపేట పీఎస్ పరిధిలోని ఓ కాలేజీ వద్ద, మూడు వంతెనల వద్దనున్న మరో కళాశాల సమీపాన ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఆకతాయిలకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఇక నల్లపాడు పీఎస్ పరిధిలో ఓ విద్యార్థినిని ప్రేమ పేరిట మేనమామ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీస్ నంబర్‌కు కాల్ చేశారు. అతడిపై పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మహిళా పీఎస్ పరిధిలోని కేవీపీ కాలనీలో ఓ పాఠశాల ఎదుట దుకాణంలోని యువకుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వరుస ఫిర్యాదులు రావడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఫిర్యాదు వస్తే దుకాణం సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తెనాలి రెండో పట్టణ పీఎస్ పరిధిలో ఓ ప్రైవేటు కళాశాల వద్ద ఆకతాయిలు అల్లరి చేసేవారు. ఫిర్యాదులు రావడంతో కుర్రాళ్లకు తమదైన శైలిలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి సురక్షితంగా మహిళలు ఇంటికి చేరేలా ఏర్పాట్లు విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు గుంటూరు జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం
13,933
200
ఈ కార్యక్రమం గణాంకాలు ఇవీ..
వాడే మొబైల్ పోలీస్ వాహనాలు 4
ద్విచక్ర వాహనాలు 8
ఫిబ్రవరి 15వ తేదీ వరకు వచ్చిన ఫోన్ కాల్స్
రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి
కాల్ చేసి ఇళ్లకు చేరిన వారి సంఖ్య
ఇప్పటివరకు వాహనాలు తిరిగిన కి.మీ.
బడుల్లో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు
కళాశాలలో నిర్వహించిన సదస్సులు
మహిళల రక్షణే ధ్యేయం
ఈ కార్యక్రమం ఆచరణకు నెల రోజులుగా శ్రమించాం. మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా ప్రారంభించాం. రాత్రివేళల్లో ప్రయాణించే మహిళలు ఏదైనా ఇబ్బందులకు గురైతే వారికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విద్యార్థులు ర్యాగింగ్ బారినపడకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
– ఎస్.సతీష్‌కుమార్,
ఎస్పీ, గుంటూరు జిల్లా
86
19
70
ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాలు
పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వారంలో ఒక రోజు విద్యార్థులకు భద్రతపై సదస్సులు నిర్వహిస్తున్నారు. ర్యాగింగ్ చట్టం, శిక్షలు వంటి అంశాలను వివరిస్తున్నారు. ర్యాగింగ్ జరిగితే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో హెల్ప్‌లైన్ల నంబర్ల స్టిక్కర్లను అతికిస్తున్నారు.
అర్ధరాత్రైనా అతివకు అండ
Comments
Please login to add a commentAdd a comment