అహరహం రక్షమాం
గుంటూరు
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
అందాల హరవిల్లు : విద్యుద్దీప కాంతుల్లో శోభిల్లుతున్న కోటప్పకొండ దివ్యక్షేత్రం అంతరచిత్రం కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపం
సాక్షి, నరసరావుపేట: కోటప్పకొండపై వేంచేసిన త్రికోటేశ్వరుడికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారుల, పూజారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కోటప్పకొండను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆగిపోయిన రోప్‌వే, గిరిప్రదక్షణ మార్గం అభివృద్ధి కార్యక్రమాలను ఆటవీశాఖతో సమన్వయం చేసుకుని చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వివరించారు. దేవదాయ శాఖ పరిధిలోని కొన్ని ఆలయాల నుంచి కోటప్పకొండ ఆలయం అప్పుగా తీసుకున్న సుమారు రూ.54.5 లక్షల బకాయిలను రద్దు చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ కేబీ శ్రీనివాస్, జిల్లా దేవదాయ శాఖ అధికారి అచ్యుత్, కోటప్పకొండ ఆలయ ఈవో చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
7
న్యూస్‌రీల్
కోటయ్యకు పట్టువస్త్రాలు
అహరహం రక్షమాం
అహరహం రక్షమాం
అహరహం రక్షమాం
అహరహం రక్షమాం
అహరహం రక్షమాం
Comments
Please login to add a commentAdd a comment