పోరు గళం | - | Sakshi
Sakshi News home page

పోరు గళం

Published Wed, Mar 5 2025 2:29 AM | Last Updated on Wed, Mar 5 2025 2:28 AM

పోరు

పోరు గళం

జగనన్న దళం..
తగ్గేదే.. లే

సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి

కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం. వారిని ఇబ్బంది పెడితే సహించేది లేదు. కార్యకర్తల కోసం అంబటి రాంబాబు కష్టపడుతున్నారు. మనందరం కలిసికట్టుగా సర్కారుపై పోరాడాలి. భవిష్యత్తులో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంది.

– మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు

తాడేపల్లిరూరల్‌: ప్రజల పక్షాన పోరుజెండా ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని, దీని కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికులై ముందుకు కదులుదామని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. మంగళవారం కుంచనపల్లిలోని శ్రీగ్రాండ్‌ ఫార్చ్యూన్‌లో వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా రెండో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేసులకు అదరని, బెదరని కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్‌ సీపీ సొంతమని, గుంటూరు జిల్లా పార్టీ శ్రేణులు రాష్ట్రానికే ఆదర్శమని, క్రమం తప్పకుండా జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా రైతులు మద్దతు ధర దక్కక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులూ సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక నష్టపోతున్నారని, ఈనెల 12న జరిగే ఫీజు పోరు ధర్నాను జయప్రదం చేసి ప్రభుత్వం మెడలు వంచుదామని పేర్కొన్నారు. మిర్చి రైతుల సమస్యలపై గుంటూరులో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గళమెత్తిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని గుర్తుచేశారు. ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకుండా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా కేసులతో వేధించిందని, భవిష్యత్తులోనూ కేసులు తప్పవని, అయినా అదరక, బెదరక ముందుకు సాగే కార్యకర్తలే మన బలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరుబాటలో ముందుకు కదులుదామని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్‌ నూరి ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలే అజెండా

ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ప్రజా సమస్యలే మన అజెండా. పోరాటానికి సిద్ధమవుదాం. కేసులకు భయపడేది లేదు. వైఎస్‌ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకుందాం.

– దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్‌ సీపీ మంగళగిరి సమన్వయకర్త

ప్రజల పక్షాన ధ్వజమెత్తుదాం ప్రతిఒకరం సైనికుడై కదులుదాం భవిష్యత్తులో కార్యకర్తలకు ప్రాధాన్యం రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి

రెడ్‌బుక్‌కు పాతరేద్దాం

కూటమి సర్కారు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. దానికి ఉప్పుపాతరేసే దిశగా పోరాడదాం. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అయితే కేసులకు భయపడుతున్నారు. మనం ముందుండి పోరాడుదాం. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేద్దాం.

– షేక్‌ ఫాతిమా, వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు

రైతుకు వెన్నుదన్నుగా నిలుద్దాం

రైతులకు వెన్నుదన్నుగా నిలిచి పోరాడదాం. గతంలో ధాన్యం బస్తా రూ.1,700 నుంచి రూ. 2 వేలు అమ్మితే ఈ ఏడాది రూ. వెయ్యి నుంచి రూ.1,300 మాత్రమే పలికింది. ఒక్కో రైతుకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు రైతులకు దూరమయ్యాయి. కూటమి ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు.

– అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
పోరు గళం 1
1/3

పోరు గళం

పోరు గళం 2
2/3

పోరు గళం

పోరు గళం 3
3/3

పోరు గళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement