అర్జీలను వేగంగా పరిష్కరించండి
గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు కూడా ప్రజలు ప్రతి వారం అర్జీలను ఇవ్వొచ్చన్నారు. ఇచ్చిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. పరిష్కారంలో నిర్లిప్తత ఉండకూడదని తెలిపారు. అనంతరం వచ్చిన 290 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment