
కొంపగోడు
గుంటూరు
సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు
పిడుగురాళ్ల: నాగులగుడిలోని సుబ్రహ్మణ్యేరస్వామికి బుధవారం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శనం చేసుకున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 526.50 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 8,023 క్యూసెక్కులు విడుదలవుతోంది.
పోలీసుల స్వచ్ఛ భారత్
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు.
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
తెనాలి: ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాన్ని అటు యజమానులు, ఇటు లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్, సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు. స్వీయ ధ్రువీకరణతో గంటల వ్యవధిలోనే అనుతులు పొందే అవకాశాన్ని ఇస్తున్నామన్న పేరుతో ప్రభుత్వం ఇంటి యజమానులు, ప్లానర్ల మెడపై కత్తి పెట్టిందనే భావన వ్యక్తమవుతోంది. దీంతో గత రెండురోజులుగా కొత్త ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్లు గీసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే అంశంపై ఈనెల ఆరో తేదీన గుంటూరులో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌తో సమావేశం జరగనుంది.
టెక్నికల్ పర్సన్ల ఆందోళన
దరఖాస్తులు, అనుబంధ పత్రాలు అప్‌లోడ్ చేసిన నాటినుంచి నిర్మాణ పనులు పూర్తి చేసేవరకు అన్ని దశల్లోనూ టెక్నికల్ పర్సన్లదే బాధ్యతని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. ఎక్కడైనా ఇంటి యజమానులు నిర్మాణాల్లో సాంకేతిక తప్పులు చేసినట్టు నిర్ధారణైతే సంబంధిత లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ లైసెన్సును ఐదేళ్లపాటు రద్దు చేస్తామని, తప్పు తీవ్రత ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఆమోదిత లే అవుట్లలోనే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలని, సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ వంటివి తప్పనిసరని వివరించింది. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యహరించినట్టు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూస్తే అనుమతులు రద్దుచేస్తామని స్పష్టం చేసింది. దీంతో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్లాను ఇచ్చిన తర్వాత యజమాని ఎక్కడైనా నిబంధన ఉల్లంఘిస్తే తమకెలా తెలుస్తుందని టెక్నికల్ పర్సన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, మేమే సమాచారం ఇవ్వాలట! అధికారులు వచ్చి కూలగొడతారట.. ఇదేం న్యాయం..’ అంటూ ప్లానర్లు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో టౌన్, సిటీ ప్లానింగ్ విభాగం ఉంటుంది. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉంటారు. వాస్తవానికి అనధికార నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత వీరిదే. అయితే కొత్త విధానంలో కేవలం లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్‌పైనే బాధ్యత పెట్టడం సరికాదనే వాదన వ్యక్తమవుతోంది.
ఈనెల నుంచే అమలు
9
చిన్న ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది
నూతన విధానం 60, 100 150 గజాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు వసూలు చేస్తున్న ఫీజులు అధికం. దీనికితోడు కఠిన నిబంధనలతో చిన్న స్థలాల్లో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని చెబుతున్నారు.
ఆర్డీతో సమావేశం
కొత్త జీవోతో తెనాలి పట్టణంలో నూతన ప్లాన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇదే విషయమై రీజనల్ డైరెక్టర్ బుధవారం గుంటూరులో లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.
ఇంటి నిర్మాణాలపై కొత్త పిడుగు
అఫిడవిట్‌తో అనుమతికి ప్రభుత్వ జీఓ
అమల్లోకి వచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్
వ్యతిరేకిస్తున్న ఇంజినీర్లు,
భవన యజమానులు
కొత్త విధానంపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే జీవో జారీచేసినా సాంకేతిక కారణాలతో ఈనెల నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ యజమానులు తిరగాల్సిన పనిలేదని, అధికారులు కొర్రీలు పెట్టి వేధిస్తారన్న ఆందోళన అవసరం లేదని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ, లైసెన్స్‌డ్ సర్వేయర్) ద్వారా భనవ నిర్మాణానికి దరఖాస్తును పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, గంటల వ్యవధిలోనే అనుమతులు పొందవచ్చని పేర్కొంది. నిబంధనలకు లోబడి భవన నిర్మాణ పనులు పూర్తిచేసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌నూ పొందవచ్చని సూచించింది. ఈ విధానంలో 18 మీటర్ల ఎత్తులోపు ఐదు అంతస్తుల్లో నిర్మాణాలను సులభతరం చేస్తూ ప్రభు త్వం ‘స్వీయ ధ్రువీకరణ పథకం’ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొంపగోడు

కొంపగోడు

కొంపగోడు

కొంపగోడు

కొంపగోడు

కొంపగోడు
Comments
Please login to add a commentAdd a comment