గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
అమరావతి : గుడారాల పండగ ఏర్పాట్లను బుధవారం ఎస్పీ పరిశీలించారు. ఆయన హోసన్నా దయాక్షేత్రం ప్రాంగణంలో పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నియంత్రణ, కంట్రోల్ రూం వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, నిర్వాహకులు అబ్రహం, జాన్‌వెస్లీ, అనీల్, సీఐ అచ్చియ్య పాల్గొన్నారు.
నేడు మద్యం
దుకాణాలకు లాటరీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గీత కులాలకు కేటాయించిన 13 మద్యం దుకాణాలకు గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 9 గంటలకు జరిగే లాటరీ ప్రక్రియకు మద్యం దుకాణానికి సంబంధించిన దరఖాస్తు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పాన్ కార్డ్‌లను తీసుకురావాలని సూచించారు.
ప్రపంచబ్యాంక్
బృందం పర్యటన
తాడికొండ: రాజధాని అమరావతిలో నిపుణులతో కూడిన ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం పర్యటించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ బృందం నిర్దేశించిన కార్యక్రమాల అమలు, వాటి నిర్వహణ రూపకల్పనపై చర్చ జరిపింది. నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ, సామాజిక రక్షణకు రూపొందించిన కార్యకలాపాలు, ప్రొక్యూర్‌మెంట్ విషయాలపై ఏపీ సీఆర్డీయే అధికారులతో బృంద సభ్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ కో టాస్క్ టీం లీడర్ గెరాల్డ్ ఒలీవర్ తదితరులు ఉన్నారు.
వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి రూ.10.10 లక్షల విరాళం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అవసరాల నిమిత్తం ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు కుమారులు డాక్టర్ వెంకటేష్, కమలేష్ రూ.10,10,116 చెక్కును బుధవారం కమిటీ అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్యకు అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు.
పోలీసుల నుంచి
తప్పించుకోబోయి వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు లాడ్జి పైనుంచి దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెలంగాణ రాష్ట్రం తుకారాంగేట్‌కు చెందిన రాములు నాయక్ గుంటూరు పరిసరాల్లో జరిగిన చోరీల్లో అనుమానితుడిగా భావిస్తున్నారు. నరసరావుపేట కోర్టుకు వాయిదాకి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని లాడ్జికి వెళ్లాడు. గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి కిటికీలో నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుడారాల పండగ ఏర్పాట్ల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment