శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

Published Fri, Mar 7 2025 9:59 AM | Last Updated on Fri, Mar 7 2025 9:55 AM

శుక్ర

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

ఇఫ్తార్‌ సహర్‌

(శుక్ర ) (శని)

గుంటూరు 6.22 5.05

నరసరావుపేట 6.24 5.07

బాపట్ల 6.22 5.04

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత నెలలో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మిర్చియార్డును సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం కొన్ని రోజులపాటు హడావిడి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, తర్వాత మంత్రులతో చర్చించడం జరిగింది. రూ.11,781 కంటే క్వింటాలుకు తక్కువ వస్తే ఆ మొత్తాన్ని భరిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు పడలేదు. చేస్తానన్న సాయంపై మార్గదర్శకాలు రాలేదు. మరోవైపు రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా గురువారం వైఎస్సార్‌ జిల్లాలో అప్పుల బాధతో మిర్చి రైతు చీపాటి మోషే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మిర్చి పంటను గుంటూరుకు తీసుకురాగా నాసిరకమని పంటను కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

నష్టం ప్రభుత్వమే భరించాలి..

రూ. 11,781 కంటే తక్కువకు కొంటే ఆ నష్టం భరించడం కాకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది సాగు వ్యయం పెరిగినందున మిర్చి రైతులందరికీ ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాది రూ. 27వేల వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం రూ.10 వేల కూడా పలకడం లేదు. మరోవైపు వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తేజా మిర్చి ధర క్వింటాల్‌కు రూ. 15 వేలు పలికితే ఇప్పుడు రూ.13 నుంచి 11 వేల మధ్య కొంటున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.22వేల నుంచి రూ.27 వేల వరకు అమ్మితే, ఇప్పుడు కనీసం రూ.10 వేలు కూడా పలకడం లేదు. మార్కెట్‌లో పంటల ధరలు పతనమైతే, రైతులను ఆదుకోవడం కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధిగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ప్రభుత్వం ప్రకటించిన దానిలో మూడో వంతు అయినా మిర్చి రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేస్తే రైతులకు కొంతైనా ఊరట లభించేది.

మూడు రోజులుగా

పడిగాపులు..

నేను రెండు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. సొంత పొలం కావడంతో ఎకరానికి రూ.2 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. గుంటూరు మిర్చి యార్డుకు 30 బస్తాలు ఎండు మిరప కాయలు తీసుకువచ్చి మూడు రోజులైంది. కొనే నాథుడు లేక పడిగాపులు కాయాల్సి వచ్చింది. తొలిరోజు(మంగళవారం) క్వింటా రూ.12 వేలు పడుతుందిని చెప్పారు. కనీసం రూ.13 వేలు ధర అయినా పలికితే అమ్ముకుందామని ఇవ్వలేదు. గురువారం అవే కాయలకు రూ.11 వేలు చెల్లిస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఇవే కాయలు క్వింటా రూ.25 వేలు చొప్పున విక్రయించాను. ఎకరాకు సుమారు రూ.లక్షకు పైగా నష్టం వస్తోంది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి.

–సూరా రాజగోపాల్‌రెడ్డి, రైతు, అంకభూపాలెం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా

వ్యాపారుల మాయాజాలం..

మిర్చికి మంచి ధర చెల్లించడం.. తక్కువ ధర చెల్లించడం అనేది మిర్చి వ్యాపారుల చేతుల్లోనే ఉంది. నేను 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. గురువారం 15 బస్తాలు తేజ రకం కాయలు యార్డుకు తీసుకువచ్చాను. ఉదయం మచ్చుకాయలు తీసుకుని క్వింటా రూ.13 వేలు అన్నారు. 11 గంటలకు రూ.11 వేలు చెల్లిస్తాం ఇస్తే ఇవ్వండి లేదంటే మీ ఇష్టం అంటున్నారు. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి.

–జె.శంకర్‌, రైతు, ఇబ్రహీంపురం, నందవరం మండలం, కర్నూలు జిల్లా

రైతులను ఆదుకునే దిశగా పడని అడుగులు ఇప్పటివరకు సాయంపై మార్గదర్శకాలు రాని వైనం మొక్కుబడి సమావేశాలతో సరిపెడుతున్న అధికారులు నోటిఫైడ్‌ మార్కెట్‌ యార్డుల్లోనే అమ్మాలనే నిబంధన తొలగించాలని మిర్చి రైతుల డిమాండ్‌ కుమ్మకై ్క ధర మరింత తగ్గిస్తున్న వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు

న్యూస్‌రీల్‌

ఏమార్చేందుకు..

కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వం మిర్చి ధర క్వింటాకు రూ.11,781 ప్రకటించిన తర్వాత మిర్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం మద్దతు ధర రూ.11,781 ప్రకటించక ముందు తేజ రకం మిర్చి క్వింటా రూ.13,500 నుంచి రూ.14,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.12 వేలకు కూడా కొనే నాథుడు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. వ్యాపారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నా.. అధికారులు ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. క్వింటాకు రూ.20 వేలు చెల్లిస్తే పెట్టిన ఖర్చులు వస్తాయి. లేదంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం.

–రమావత్‌ అఖిల్‌, రైతు, యండ్రపల్లి, యరగ్రొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా

మరోవైపు అధికారులు గత డిసెంబర్‌ నుంచి రోజువారీగా ఎంత మిర్చి కొనుగోలు చేసింది. ఎవరి వద్ద కొన్నారు. వారి ఆధార్‌ వివరాలు కావాలంటూ వ్యాపారులను అడిగారు. ఇది కేవలం కాలయాపన చేసి.. సీజన్‌ అయ్యేవరకూ నడిపే కుట్ర అని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఈ లెక్కలన్నీ ఉంటాయని, తమ దగ్గర లేనట్టు మార్కెటింగ్‌ అధికారులు వ్యాపారులను వివరాలు అడగడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి మిర్చి సీజన్‌ ప్రారంభమై రోజూ లక్షన్నరకు పైగా బస్తాలు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటుంటే రెండు నెలల తర్వాత లెక్కలు అడగడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20251
1/5

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20252
2/5

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20253
3/5

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20254
4/5

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20255
5/5

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement