నేటి నుంచి మూడు వంతెనల మీదుగా రాకపోకలు
గుంటూరు విద్యానగర్‌లోని రెండిళ్లలో గురువారం భారీ చోరీలు జరిగాయి. ఈ ఘటనలు నగరంలో కలకలం రేపాయి. గుంటూరు విద్యానగర్‌లోని సాయినివాస్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో సాయంత్రం.. అదే వీధిలోని అక్షయ లీలా హోమ్స్‌లోని మరో ఫ్లాట్‌లో అర్ధరాత్రి చోరీలు జరిగాయి. సుమారు రూ.2.50 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.50 లక్షలు చోరీకి గురయ్యాయి. ఘటనాస్థలాలను డీఎస్పీ అరవింద్, ఎస్‌ఐ నరహరి పరిశీలించారు. –లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్)
డీఎస్సీకి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): మెగా డీఎస్సీకి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు 10వ తరగతి, టీటీసీ/బీఎడ్ మార్కుల లిస్ట్, టెట్ మార్కుల లిస్ట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరిచి రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్, గుంటూరు కార్యాలయంలో ఈనెల 10వ తేది నుంచి అందించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0863–2358071 నంబర్‌ను సంప్రదించాలని వివరించారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రైల్వే ట్రాక్ ఎక్స్‌టెన్షన్ పనుల నిమిత్తం గంటూరు మూడు వంతెనల మీదుగా నవంబర్ 25 నుంచి రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. 60 రోజుల్లో పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే వంద రోజులు పూర్తయినా ఇప్పటికీ పనులు పూర్తిచేయలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవస్థలను గుర్తించిన సాక్షి దినపత్రిక పలుమార్లు కథనాలు ప్రచురించింది. శుక్రవారం కూడా ‘రైల్వే ట్రాక్ విస్తరణతో నరకయాతన’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు హడావుడిగా పెండింగ్ పనులు పూర్తిచేయకుండానే వంతెనలపై నుంచి రాకపోకల పునరుద్ధరణకు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మూడు వంతెనలను ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment