ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
గుంటూరు ఎడ్యుకేషన్: జీవితంలో ఎటువంటి విపత్కరస్థితి ఎదురైనామహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని గుంటూరు జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ కె.సుప్రజ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మహిళా విభాగ, రోటరీ క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏస్పీ సుప్రజను సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు పి.రత్నప్రియ, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎం.స్వర్ణలతాదేవి, డాక్టర్ ఆర్.సిందూజ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, మహిళా విభాగ కన్వీనర్ కవిత, సభ్యులు ఆర్.జయ శైలజ, డాక్టర్ నాగ నిర్మలా రాణి, డాక్టర్ ఆర్.శిరీష, కె.సునీత, బి.జ్యోతి, జమృద్ బేగం, విద్యార్థినులు పాల్గొన్నారు.
మహిళల పాత్ర కీలకం
సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉండటం గర్వకారణమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మహిళా ఉద్యోగినుల ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతి బసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొన్నారు.
డీఆర్‌ఎం కార్యాలయంలో..
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ ఆకాంక్షించారు. స్ధానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం డివిజన్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు పలు క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. విశేష కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కె.సైమన్, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఎం.ఆశాలత, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ షేక్.షాహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఇంజజనీర్ కో ఆర్డినేషన్ జె.అనూష, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యరాజ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ , కో ఆర్డినేషన్ ప్రదీప్, ఆయా విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment