
పాన్‌మసాలా యాడ్స్ చేస్తున్న సెలబ్రిటీలపై చర్యలు తీసుకో
ప్రజారోగ్యానికి పెనుముప్పులా మారిన పాన్ మసాలా ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ప్రముఖ సినీనటులపై కఠినమైన చర్యలు చేపట్టాలి. బాలీవుడ్ నటులు, ప్రముఖులు ఏకమై హానికరమైన పాన్‌మసాలా ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన సెలబ్రిటీలపైనా ఇటీవల తెలంగాణలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రకటనలు యిచ్చే వారిపై కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
– ఏపీ సిటిజన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు, న్యాయవాది షేక్.జిలానీ, న్యాయవాదులు నూనె పవన్‌తేజ, పాలపాటి అనీల్‌కుమార్, సత్య, సైదా, షారూక్.