
ఇంటర్ ఫలితాల్లో విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ
చేబ్రోలు: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనన మాట్లాడారు. శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు వి.కౌశిక్ (992), ఎం.అఖిలేష్ (989), జి.నాగేంద్ర గుప్త (989), ఎన్.నాగ మోక్షజ్ఞ(989), బి.షాన్ బాషా (988), ఎస్.మోహన్ నాగ కార్తిక్ (988), సీహెచ్. చరణ్ కుమార్ (987), వై.పార్థసారథి (987), కె.భానుప్రకాష్‌రెడ్డి (987), కె.యశస్వి (987), ఎం.కవిత (987), పి.కంచన్ కుమారి (987), టి.జాహ్నవి (987) మార్కులు సాధించారని వివరించారు. మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ఎస్‌డీ మహమ్మద్ అష్రఫ్ (465), టీడీఎస్‌ఎన్‌పీ లక్ష్మణ్ నారాయణ (465), పి.పూజిత (465) జి. యశ్వంత్ (464), కె.తేజ ప్రకాష్ (464), పీ.సమీర్ (464), ఎం.సత్య (464), డి.తరుణ్ రాజు (464), ఎన్.వంశీ క్రిష్ణా రెడ్డి (464), డి.రామ్ చరణ్ (464), ఎం.హరీష్ (464), ఐ.భాను త్రివేద్ (464), ఎస్‌కే ఫయాజ్ అహ్మద్ (464), పి.సుషాంత్ (464), ఎం.వి.అమృత వర్షిణి (464), ఓ.సుప్రియ (464), పి.వర్షిణి (464), ఆర్.మహేశ్వరి (464), వి.నిక్షిత (464), కాటూరి అక్షయ (464), ఆర్.లక్ష్మి చరిత (464) మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ లావు రత్తయ్య తదితరులు అభినందించారు. కార్యక్రమంలో వడ్లమూడి, గుంటూరు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ జె. మోహనరావు, వై.వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.