
‘సాక్షి’పై దాడిని ఖండిస్తున్నాం
గుంటూరు మెడికల్: ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా పేర్కొన్నారు. సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వరంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఎవరైనా రాసిన వార్త తమకు ఇబ్బందికరమని భావిస్తే ప్రెస్ కౌన్సిల్‌ను సంప్రదించవచ్చన్నారు. లేని పక్షంలో కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. అంతేకానీ అప్రజాస్వామికంగా దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు శర్మ, నగర అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్, కార్యదర్శి కె.ఫణి, పరసశ్యామ్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి డి.రమేష్‌బాబు, సాక్షి టీవీ జిల్లా ఇన్‌చార్జి అశోక్, కెమెరామెన్ బాషా, ఫొటోగ్రాఫర్ రామ్‌గోపాల్‌రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ గోపి, సర్క్యూలేషన్ మేనేజర్ అబ్దుల్లా, సాక్షి అడ్వర్‌టైజ్‌మెంట్ మేనేజర్ ఎంవీడీ సత్యనారాయణ, సాక్షి సిబ్బంది రవి, భగత్, ఎం.సి.హెచ్.కోటిరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, రఘు, షేక్ సుభాని, ప్రకాష్, కృష్ణ, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే గుంటూరు
జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా
గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యుల నిరసన