114 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు
వరంగల్: జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 114 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి 201.880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. గుర్తించిన 26 జిన్నింగ్ మిల్లుల ద్వారా 2,108 మంది రైతుల నుంచి 5449.36 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి ధాన్యం, పత్తి పంట కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తదితర అంశాలపై కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు డీసీపీ రవీందర్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రూప్–3 పరీక్షలపై..
పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి గ్రూప్–3 పరీక్షల నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లానుంచి కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లా నుంచి 11,232 మంది గ్రూప్–3 పరీక్షలు రాస్తున్నారని, అందుకు 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీసీలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మీరావు, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వీసీలో వరంగల్ కలెక్టర్ సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment