కెరీర్ గైడెన్స్ శిక్షణ వినియోగించుకోవాలి
డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకు ఉపాధ్యాయులకు కేరీర్ గైడెన్స్‌పై రెండ్రోజులపాటు జరిగే ఈశిక్షణను వినియోగించుకోవాలని హనుమకొండ డీఈఓ వాసంతి కోరారు. జిల్లాలో ఎంపికచేసిన 143 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గురువారం హనుమకొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ప్రారంభించారు. ఈశిక్షణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. పాఠశాలల్లోని విద్యార్థుల నేపథ్యం, సామాజిక అవసరాన్ని బట్టి పాఠశాలల్లో అభ్యసన సంబంధిత సమస్యలుంటాయన్నారు. అలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో ఈశిక్షణలో మెలకువలు నేర్చుకుని బోధించాలన్నారు. పరీక్షలంటే భయం పోయేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. శిక్షణలో హనుమకొండలోని ప్రభుత్వ విద్యాకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మఽహ్మద్అబ్దుల్హై, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, రీసోర్స్ ఉపాధ్యాయులు సంపత్‌కుమార్, సీహెచ్ శ్రీనివాస్, అయిత శ్రీనివాస్, సునీత, కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment