హైదరాబాద్‌: నేడు రాజస్తాన్‌తో హైదరాబాద్‌ మ్యాచ్‌ | Sunrisers Hyderabad Playing 11 in IPL 2023 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: నేడు రాజస్తాన్‌తో హైదరాబాద్‌ మ్యాచ్‌

Published Sun, Apr 2 2023 8:05 AM | Last Updated on Sun, Apr 2 2023 10:15 AM

Sunrisers Hyderabad Playing 11 in IPL 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం మరోసారి అభిమానులతో హోరెత్తనుంది. వరుసగా మూడు సీజన్లు టీవీల్లో, మొబైల్‌ ఫోన్‌లలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసి సంతృప్తి చెందిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ప్రత్యక్షంగా మైదానంలో ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటితో మొదలు పెట్టి మే 18 వరకు ఏడు ఐపీఎల్‌ మ్యాచ్‌లు స్టేడియంలో అలరించనున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌... ఆపై ఆదివారం.. వేసవి వినోదాన్ని ఆస్వాదించేందుకు ఈ కాంబినేషన్‌ సరిగ్గా సరిపోతుంది.

నేడు సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే పోరులో తలపడనుంది. ఈ రోజు మాత్రమే కాదు, వచ్చే ఆదివారం కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఉండటంతో వరుసగా రెండు వారాంతాలు ఫ్యాన్స్‌కు పండుగే. సీజన్‌లో తొలి మ్యాచ్‌కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసిన వేదికల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. దాంతో అవుట్‌ఫీల్డ్‌, పిచ్‌ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్‌ జరపాలని హెచ్‌సీఏ పట్టుదలగా ఉంది.

ఫ్యాన్స్‌ రెడీ...
ఐపీఎల్‌లో వినోదం గురించి నగర అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్‌ ఫలితాలతో సంబంధం లేకుండా స్థానిక జట్టుకు పెద్ద సంఖ్యలో మద్దతు లభించడం ఖాయం. దాంతో మరోసారి మైదానం ఆరెంజ్‌ రంగుతో నిండిపోనుంది. ప్రస్తుతానికి నేడు, వచ్చే ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల కోసమే సన్‌రైజర్స్‌ టికెట్లను అందుబాటులో ఉంచింది. రెండు మ్యాచ్‌లకు సంబంధించి తక్కువ విలువ ఉన్న టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. ‘పేటీఎం ఇన్‌సైడర్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రూ. 1367 ఆపై విలువ గల టికెట్లు లభిస్తున్నాయి. జింఖానా మైదానం, 24 సెవెన్‌, మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌ అవుట్‌లెట్‌లలో కూడా నేరుగా టికెట్లు కొనుక్కునే అవకాశం ఉంది.

నాటి మ్యాచ్‌ గుర్తుందా...
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఉప్పల్‌ స్టేడియంలో 2019 ఏప్రిల్‌ 29న చివరిసారి మ్యాచ్‌ ఆడింది. పంజాబ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో రైజర్స్‌ 45 పరుగులతో గెలిచింది. సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్‌ అభిమానులకు ఆత్మీయులుగా మారిపోయిన పలువురు క్రికెటర్లు ఈసారి ఆ జట్టులో లేరు. ముఖ్యంగా తన డ్యాన్స్‌లు, తెలుగు టిక్‌టాక్‌ పాటలతో మన అభిమానులకు ఎంతో చేరువైన డేవిడ్‌ వార్నర్‌, ‘కేన్‌ మామా’ విలియమ్సన్‌, వరుసగా మ్యాచ్‌లు గెలిపించిన రషీద్‌ ఖాన్‌ కూడా ప్రత్యర్థి టీమ్‌లలో ఉన్నారు. దాంతో ఈసారి జట్టు కాస్త కొత్తగా కనిపించనుంది. 2019 సీజన్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా మన అభిమానులు ఆస్వాదించారు. చైన్నెతో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 1 పరుగు తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఈసారి చైన్నె జట్టు హైదరాబాద్‌లో ఆడబోవడం లేదు. కాబట్టి మహేంద్ర సింగ్‌ ధోని ఆటను చూసే అవకాశం మన ప్రేక్షకులు కోల్పోయినట్లే!

ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్లు

ఏప్రిల్‌ 2 – ప్రత్యర్థి జట్టు రాజస్తాన్‌ – మధ్యాహ్నం 3.30 గంటల నుంచి

ఏప్రిల్‌ 9 – పంజాబ్‌ – రాత్రి 7.30 గం. నుంచి

ఏప్రిల్‌ 18 – ముంబై – రా.7.30 గం. నుంచి

ఏప్రిల్‌ 24 – ఢిల్లీ – రా. 7.30 గం. నుంచి

మే 4 – కోల్‌కతా – రా. 7.30 గం.నుంచి

మే 13 – లక్నో – మ.3.30 గం. నుంచి

మే 18 – బెంగళూరు – రాత్రి 7:30 గంటల నుంచి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement