
జీడిమెట్ల: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను..నా చావుకు నేనే కారణం’ అంటూ ఓ యువకుడు తన చెల్లికి వా ట్సాప్‌లో సందేశం పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పవన్ వివరాల ప్రకారం... యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన శివ గణేష్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి చింతల్ చంద్రానగర్‌లో ఉంటూ ఎంటీఅర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
కొన్ని రోజులు చిన్నాన్న శివ స్వామి ఇంట్లో ఉన్నాడు. అనంతరం ఓ గది అద్దెకు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 12 గంటలకు తన చెల్లి అంజలికి వాట్సాప్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేశాడు. ఉదయం మెసేజ్ చూసిన అంజలి చింతల్‌లో ఉండే తన చిన్నాన్న శివస్వామికి ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేసింది.
అతను శివగణేష్ ఉండే గదికి వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment