అగ్ని వీరుల కుటుంబ సభ్యులతో అజిత్ అశోక్ దేశ్‌పాండే
కంటోన్మెంట్: భారత మిలిటరీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకంలో తొలి బ్యాచ్‌కు చెందిన 116 మంది సికింద్రాబాద్‌లోని 1ఈఎంఈ సెంటర్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఏఓసీ సెంటర్ బసంత్ సింగ్ పరేడ్ గ్రౌండ్‌లో అగ్నివీరుల మొదటి బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. అగ్ని వీరులకు సెంట్రల్ కమాండెంట్ అజిత్ అశోక్ దేశ్ పాండే బ్యాచ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరెస్ట్ శిఖరం, అంతరిక్ష గ్రహాలపై తొలిసారి కాలుమోపిన వారి మాదిరిగానే, తొలి బ్యాచ్ అగ్నివీరులకు గుర్తింపు లభిస్తుందన్నారు. అగ్నివీరులు అంకితభావంతో పనిచేసి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు. దేశ రక్షణ నిమిత్తం తమ బిడ్డలను అగ్ని వీరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో గొప్పదని కొనియాడారు. తమ బిడ్డలు ఆర్మీలో చేరి దేశ రక్షణకు సేవలు అందించడం తమకెంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అన్నారు. ఇలాంటి గొప్ప అవకాశం అందరికీ రాదని, దేశ సేవ కోసం పాటుపడాల్సిన బాధ్యతను ఎల్లవేళలా గుర్తుంచుకుంటూ అంకితభావంతో పనిచేసే విధంగా వారిలో ప్రోత్సాహాన్ని నింపినట్లు తెలిపారు. 1 ఈఎంఈ సెంటర్‌లో అగ్నివీరులకు మిలిటరీ ప్రాథమిక శిక్షణ ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమై మార్చి 10 నాటికి పూర్తయింది. అనంతరం కారప్స్ ఆఫ్ ఈఎంఈ, 1 ఈఎంఈ సెంటర్‌లలోని టెక్నికల్ ట్రెయినింగ్ విభాగాల్లో అడ్డాన్స్‌డ్ ట్రెయినింగ్ కొనసాగింది. అగ్నివీరులకు 14 వారాల అడ్డాన్స్‌డ్ శిక్షణ శనివారంతో ముగిసింది. జాతీయ పతాకాన్ని చేతబూని, మత గ్రంఽథాలు, రెజిమెంటల్ ఫ్లాగ్‌ల సమక్షంలో అగ్నివీరులు ప్రమాణం చేశాక, వీరిని గౌరవంగా సైనిక దళంలోకి స్వాగతించారు. కార్యక్రమానికి హాజరైన అగ్నివీరులు తల్లిదండ్రులను గౌరవ పదక్స్‌తో గౌరవించారు.
తొలి బ్యాచ్ అభ్యర్థుల శిక్షణ పూర్తి
ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్
Comments
Please login to add a commentAdd a comment