
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మారబోయిన రవికుమార్ యాదవ్ స్థిరచరాస్తుల విలువ అక్షరాల రూ.151 కోట్లకు పైమాటే. అప్పు రూ.44 లక్షలు. రవి కుమార్‌కు ఉస్మాన్‌నగర్, వట్టినాగులపల్లిలో రూ.16.54 కోట్ల విలువైన వ్యవసాయ భూములున్నాయి. కొండాపూర్, గోపన్‌పల్లి ప్రాంతాల్లో రూ.94.84 కోట్ల విలువైన వ్యవసాయేతర స్థలాలున్నాయి.
వీటితో పాటు కొండాపూర్, గోపన్‌పల్లి, ఉస్మాన్‌నగర్ ప్రాంతాల్లో రూ.40.47 కోట్ల విలువ గల నివాస భవనాలు ఉన్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఖాతాల్లో రూ.15 కోట్ల విలువైన చేసే బ్యాంకు ఫిక్స్‌డ్, టర్మ్ డిపాజిట్‌లు, బాండ్లు, షేర్లు, పాలసీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (మార్కెటింగ్) పూర్తి చేసిన రవికుమార్‌పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment