హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ అనంతరం 332 మంది అభ్యర్థులు అర్హత పొందారు. మొత్తం 435 మంది నామినేషన్లు దాఖలు చేయగా సవ్యంగా లేకపోవడంతో 103 మందిని అనర్హులుగా గుర్తించారు. ముషీరాబాద్‌నుంచి 33 మంది, మలక్‌పేట నుంచి 27మంది, అంబర్‌పేట నుంచి 20 మంది,ఖైరతాబాద్ నుంచి 27 మంది, జూబ్లీహిల్స్ నుంచి 20మంది, సనత్‌నగర్ నుంచి 18 మంది, కార్వాన్‌నుంచి 21మంది, గోషామహల్‌నుంచి 24 మంది,చార్మినార్ నుంచి 14 మంది, చాంద్రాయణగుట్ట నుంచి 17 మంది, యాకుత్‌పురా నుంచి 27 మంది, బహదూర్‌పురా నుంచి 12 మంది, సికింద్రాబాద్ నుంచి 27 మంది అభ్యర్థులుగా మిగిలారు.
రంగారెడ్డి జిల్లాలో 33
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 280 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వివరాలు సరిగా లేని 33 నామినేషన్లను తిరస్కరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4, మహేశ్వరంలో 3, షాద్‌నగర్‌లో 3, చేవెళ్లలో 4, కల్వకుర్తిలో 1, ఎల్బీనగర్‌లో 5, శేర్‌లింగంపల్లిలో 6, రాజేంద్రనగర్‌లో ఏడుగురి నామినేషన్లు తిరస్కరించారు.
మేడ్చల్‌లో 71
మేడ్చల్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 261 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా స్క్రూటినీలో 71 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment