హైదరాబాద్: ఇంటికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తిని తన కన్నతల్లి అంత్యక్రియలకు హాజరుకాకుండా చేసి పైశాచికత్వం చూపిన మహిళపై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. డిఫెన్స్ కాలనీకి చెందిన అనుపమ తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో నగరంలోని ప్రైవేట్ సంస్థ ద్వారా దుర్గాప్రసాద్‌ను కేర్ టేకర్‌గా ఏర్పాటు చేసుకుంది. 20 రోజులుగా దుర్గాప్రసాద్ అనుపమ ఇంట్లో ఉంటూ వారి తండ్రికి సేవలు చేస్తున్నాడు. ఈ నెల 26న దుర్గాప్రసాద్ తల్లి మృతి చెందింది. దీంతో తాను తన తల్లి అంత్యక్రియలకు వెళ్లాలని అనుపమను కోరగా అందుకు ఆమె నిరాకరించింది.
మీ స్థానంలో వేరే వారిని రప్పిస్తే గానీ నువ్వు వెళ్లడానికి వీల్లేదంటూ శాసించింది. పైగా అంత్యక్రియలను ఫోన్‌లో వీడియో కాల్ చూడవచ్చంటూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. దీంతో ప్రసాద్ శుక్రవారం అనుపమ ఇంటి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరణించిన తన తల్లిని కడచూపు చూడటానికి సైతం అవకాశం లేకుండా తనను నిర్బంధించి మనోవేదనకు గురి చేసిందని అనుపమపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment