స్టూడెంట్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా
గచ్చిబౌలి: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌గా మారిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీన్యాబ్), మియాపూర్ పోలీసులు ఆమె నుంచి 60 గ్రాముల సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శతాబ్ధి మన్నా(24) అరెస్ట్ చేశామని, మరో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడు. గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ శతాబ్ధి మన్నా బుధవారం సాయంత్రం మియాపూర్ బస్‌స్టాప్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రూ.6 లక్షల విలువైన సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జార్కండ్ రాష్ట్రం, జంషెడ్‌పూర్‌కు చెందిన మన్నా బెంగళూర్‌లో బీబీఏ పూర్తి చేసింది. అక్కడే ఆమెకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడింది. బెంగళూరులోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న శతాబ్ధి మన్నా తన గదిలోనే డ్రగ్స్ నిల్వ ఉంచి డ్రగ్ పెడ్లర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో డ్రగ్స్ అందజేసేందుకు వచ్చిన మన్నాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు., ఏదైనా పార్టీ లేదా పెడ్లర్లకు విక్రయించేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చి ఉండవచ్చునన్నారు. మన్నా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే సబ్ పెడ్లర్‌ను గుర్తించామని, మరి కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. వీరు గోవా, బెంగళూర్, రాజస్తాన్, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ఉందని ఈ డ్రగ్ చైన్‌ను త్వరలోనే చేధిస్తామన్నారు. మరో నిందితుడు వారెన్ కొకరంగోకు అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లో ఉన్నాడని, పరారీలో ఉన్న అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. డ్రగ్ పెడ్లర్లు జార్కండ్‌లో పేదరికంలో ఉన్న విద్యార్థులకు డబ్బు ఆశ చూపి ఈ దందాలోకి దించుతున్నట్లు తాము గుర్తించామన్నారు. టీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ తెలంగాణకు ప్రజలు సహకరించాలన్నారు. గత అక్టోబర్‌లో అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చౌటుప్పల్ పీఎస్‌ల పరిధిలో రాజస్తాన్ గ్యాంగ్ నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ, డిసెంబర్ 25న ఫిల్మ్‌నగర్ పీఎస్ పరిధిలో 17.38 గ్రాముల ఎండీఎంఏ, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఫిబ్రవరి 11న ఇద్దరు రాజస్తాన్ పెడ్లర్ల నుంచి 40 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, టి న్యాబ్ డీఎస్పీ హరిచంద్రారెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్‌లో 60 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
బెంగళూర్‌కు చెందిన కార్పొరేట్ ఉద్యోగిని శతాబ్ధి మన్నా అరెస్ట్
అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీ
Comments
Please login to add a commentAdd a comment