గోల్డ్‌ లోన్‌ సొమ్ము నేరగాళ్ల పాలు! | - | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్‌ సొమ్ము నేరగాళ్ల పాలు!

Published Fri, Feb 21 2025 8:46 AM | Last Updated on Fri, Feb 21 2025 8:46 AM

-

సాక్షి, సిటీబ్యూరో: విద్య, వైద్య అవసరాల కోసం ఓ కార్మికుడు తీసుకున్న గోల్డ్‌ లోన్‌ సొమ్ము సైబర్‌ నేరగాళ్ల పరమైంది. ఈ మొత్తంతో పాటు అప్పటికే తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాంతో కలిపి రూ.2.98 లక్షలు ఈ–కేటుగాళ్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ దిససరి కార్మికుడు (56) 20 రోజుల క్రితం గోల్డ్‌ లోన్‌ తీసుకున్నారు. అందులోంచి కొంత మొత్తం డ్రా చేసుకునేందుకు రెండు రోజులు క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు ఖాతాలో నగదు లేదని చెప్పడంతో కంగుతిన్న అతను పాస్‌బుక్‌ అప్‌డేట్‌ చేయించాడు. దీని ద్వారా కొన్ని అనధికార లావాదేవీలు జరిగాయని, బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారని తెలిసింది. దీంతో ఆయన గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి నేరం జరిగిన తీరుపై ఓ అంచనాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం బాధితుడు సిటీ బస్సులో ప్రయాణిస్తూ తన సెల్‌ఫోన్‌ పొగొట్టుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడం, సిమ్‌కార్డు బ్లాక్‌ చేయించడం తదితర చర్యలు తీసుకోలేదు. సదరు ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు నెంబరే బ్యాంకు ఖాతాతో లింకై ఉండగా... ఫోన్‌ పే, గూగుల్‌ పే సహా ఎలాంటి యూపీఐ యాప్స్‌ అందులో లేవు. ఈ ఫోన్‌కు చేజిక్కించుకున్న వ్యక్తులు అందులో యూపీఐ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేశారు. ఖాతాతో లింకై న సిమ్‌కార్డు బ్లాక్‌ కాకపోవడంతో వాళ్ల పని తేలికై ంది. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలు దానికే రావడంతో ఆ యాప్స్‌ను నేరగాడు యాక్టివేట్‌ చేసుకున్నారు. వీటి ద్వారా లావాదేవీలు చేస్తూ రూ.రూ.2.98 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలపై బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పటికీ... ఫోన్‌ సైతం నేరగాళ్ల వద్దే ఉండటంతో బాధితుడికి విషయం తెలియలేదు. ఫోన్‌ అన్‌లాక్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ సైతం పటిష్టంగా లేకపోవడం సైబర్‌ నేరగాళ్లకు కలిసి వచ్చింది. ఈ కేసు నేపథ్యంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కొన్ని కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో కచ్చితంగా ఫౌండ్‌ మై డివైజ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా ఫోన్‌ పోగొట్టుకుంటే వెంటనే సిమ్‌కార్డు బ్లాక్‌ చేయించుకోవాలని, పోలీసులతో పాటు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. తన నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలను నిలిపివేయాల్సిందిగా బ్యాంకును కోరాలని సూచిస్తున్నారు.

సిటీ బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్న కార్మికుడు

దాన్ని చేజిక్కించుకుని యూపీఐ యాప్స్‌ ఇన్‌స్టాల్‌

వీటితో రూ.2.98 లక్షలు కాజేసిన ఈ–కేటుగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement