హుడాకాంప్లెక్స్: కులగణన రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనలో పలు ఆరోపణలు వచ్చినందున తిరిగి సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆయన సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు, పార్టీ సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్‌యాదవ్‌లతో సమావేశమై కులగణనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణనలో పాల్గొనని వారు ప్రస్తుతం రీ సర్వేలో తమ పేర్లను కులాల వారీగా నమోదు చేసుకోవాలన్నారు. కుల సంఘాల అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌యాదవ్, శ్రీనివాస్, ధన్‌రాజ్‌గౌడ్, ఇమ్రాన్‌అలీ, శివకుమార్, షఫీ, యూనస్, జంగారెడ్డి, సుశీల, సంగీత తదితరులు పాల్గొన్నారు.