‘ఛావా’ చిత్ర ప్రదర్శన
కుత్బుల్లాపూర్: మొగలులు భారతీయులపై సాగించిన దమకాండను ‘ఛావా’చిత్రం ప్రతిబింబిస్తోందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కొంపల్లిలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్‌సాగర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన చావా చిత్రాన్ని ఎంపీ రాజేందర్ వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 400 ఏళ్ల క్రితం మొగలుల దమనకాండ నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు శివాజీ మహరాజ్ నడుం బిగించారని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన వీరోచితంగా పోరాడారని తెలిపారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న శంభాజీ మహరాజ్ ఆనాడు మొగల్ చక్రవర్తులపై సాగించిన పోరాటాన్ని ఛావా చిత్రం ద్వారా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఎంపీ ఈటల వెంట బీజేపీ నాయకుడు రాజిరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ శివాజీ రాజు, మాధురి, దుర్గా, అశోక్, మధు, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్ నాయక్, మహేందర్, తిరుపతి తదితరులు ఉన్నారు.
ర్యాలీగా వెళ్లి... చిత్రం తిలకించి..
సుల్తాన్‌బజార్: శంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఛావా చిత్రానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆదివారం కాచిగూడ క్రాస్ రోడ్డులోని ఐనాక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సనాతన ధర్మసేన వ్యవస్థాపకుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్‌తో కలిసి 150 మంది జాతీయవాద వైద్యులు కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో ర్యాలీగా ఐనాక్స్ థియేటర్ వద్దకు చేరుకుని తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment