వినూత్నంగా ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టి–వర్క్స్ వేదికగా నిర్వహించిన ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’కార్యక్రమం విభిన్న కళలను, కళాకారులను ఒకే వేదిక మీదకు చేర్చింది. ఆదివారం జరిగిన ఈ కళాత్మక వేదికలో పలువురు ఆర్టిస్టులు వినూత్న కళలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రముఖ ఆర్ట్ బ్రాండ్ బ్రస్ట్రో సహకారంతో బియాండ్ హైదరాబాద్, ఆర్ట్ ఆర్టిస్ అఫీషియల్, ఎన్‌ఆర్‌బీ, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వంటి సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారుల హస్తకళా ప్రదర్శనలతోపాటు కళా ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. మేకింగ్ కల్చర్‌ను ప్రోత్సహించడానికి ఇటీవల టి–వర్క్స్ ఆధ్వర్యంలో మేకర్స్ కలెక్టివ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన ఈ వేదికలో హ్యాండ్స్–ఆన్ వర్క్‌షాప్‌లు, నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఆర్టిసన్స్ ఫ్లీ 23వ ఎడిషన్‌లో 40 మంది వరకు కళాకారులు సృష్టించిన కళాకృతులను సామాజిక అనుసంధానాన్ని ప్రదర్శించాయి. ఈ వినూత్న కార్యక్రమంలోని ప్యానెల్ చర్చలో ప్రముఖ నటి గీతాభాస్కర్, స్క్రైబుల్ ఆర్టిస్టు హరీష్ భాగవతులు, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు ఇషాక్ జియాయీ, చిత్రకారుడు–టెడెక్స్ స్పీకర్ ప్రియతం తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఆర్టిసాన్స్ ఫ్లీలో వెయ్యికి పైగా ఔత్సాహికులు, కళాకారులు పాల్గొన్నారు.
టీ వర్క్స్ వేదికగా కళాత్మక సందడి
ఆర్టిసాన్స్ ఫ్లీలో ఆకట్టుకున్న ఆర్టిస్టులు, కళాకృతులు
ప్యానల్ చర్చలో పాల్గొన్న ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment