
తార్నాక జంక్షన్ రీ ఓపెన్
లాలాపేట: తార్నాక జంక్షన్ మరో వారం రోజుల్లో రీ ఓపెన్ కానుంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తార్నాక జంక్షన్‌లో రోడ్డు, ఓయూ వైపు డివైడర్ల నిర్మాణం, లాలాపేట వైపు బస్ షెల్టర్ షిఫ్టింగ్ వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం జంక్షన్ ఫ్లై ఓవర్‌కు పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి.
తగ్గనున్న యూ టర్న్‌ల సమస్య..
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 8 ఏళ్ల క్రితం తార్నాక ప్రధాన రహదారిలో రైల్వే డిగ్రీ కళాశాల వద్ద, ఇటు హబ్సిగూడ వైపు ఐఐసీటీ వద్ద యూ టర్న్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వెళ్లేందుకు సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణ దూరం పెరగడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. దీంతో పాటు యూటర్న్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగేవి. ఈ జంక్షన్‌ను పునరుద్ధరిస్తే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చెక్ పెట్టినట్లవుతుందని వాహనదారులు పేర్కొంటున్నారు. తార్నాక సిగ్నల్ ఓపెనింగ్‌కు సంబంధించిన పనులను వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డెవిస్ అధికారులకు సూచించారు. ఈ మేరకు తార్నాక జంక్షన్ అభివృద్ధి పనులను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించి బల్దియా అధికారులతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
వారం రోజుల్లో..
Comments
Please login to add a commentAdd a comment