
జిహ్వ.. వహ్వా అనేలా..
సాక్షి, సిటీబ్యూరో: స్విగ్గీ మొదటి ఎడిషన్లో పలు విభాగాల్లో ముందంజలో ఉన్న నగరం ఈసారి మరిన్ని విభాగాల్లో పోటీ పడనుంది. ఉత్తమ రెస్టారెంట్, ఉత్తమ స్ట్రీట్ ఫుడ్ వంటి విభిన్న అంశాల్లో ఓటింగ్ ఏర్పాటు చేసింది. ‘క్రౌనింగ్ దోజ్ హూ ఈట్’ అనే థీమ్‌తో ఇచ్చే ఈ అవార్డులకు ఆహార ప్రియులు మార్చి 24 వరకూ స్విగ్గీ యాప్‌లో ఓటింగ్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. విజేతలను మార్చి 25న ప్రకటిస్తారని పేర్కొన్నారు. నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహారాన్ని అందించే చెఫ్‌లు, రెస్టారెంట్స్ తదితర ఆహార రంగ వేదికలకు ఈ అవార్డులను అందించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 130 నగరాలకు 90కి పైగా కేటగిరీల్లో 11 వేలకు పైగా బ్రాండ్లతో 16 వేలకు పైగా నామినేషన్లు వచ్చినట్లు అంచనా. ఫుడ్ డెలివరీకి ఇష్టమైన వాటి నుంచి డైనింగ్ అవుట్ జెమ్స్ వరకూ, ఫైన్ డైనింగ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ హాట్‌స్పాట్‌లతో సహా విభిన్న వేదికలు భాగం కానున్నాయి.
ప్రముఖ నగరాలతో పాటు..
ఈ అవార్డుల కోసం హైదరాబాద్ నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చైన్నె, పుణె, కోల్‌కతా, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూర్, గోవా, ఇండోర్, జైపూర్, లక్నో, రాంచీ, వారణాసి, అమృత్‌సర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, గౌహతి, జలంధర్, కాన్పూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, మైసూర్, నాగ్‌పూర్, పాట్నా, పాండిచ్చేరి, సూరత్, ఉదయపూర్, విజయవాడ, అగర్తలా, అహ్మదాబాద్ వంటి 130 పైగా నగరాలు భాగస్వామ్యం కానున్నాయి.
విభిన్న విభాగాల్లో..
ఈ అవార్డులను ఉత్తమ బిర్యానీ, ఉత్తమ చైనీస్ వంటకాలు, అత్యుత్తమ కేకులు, డెజర్ట్స్ సహా, బెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ గ్లోబల్ ఫ్లేవర్ వంటి విభిన్న విభాగాలు ఇందులో ఉన్నాయి. 2025 స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ విజేతలను ప్రత్యేక ఫ్రేమ్డ్ ఫలకంతో సత్కరిస్తారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులు మార్చి 24 వరకూ ఈ ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎంపిక చేయాలని స్విగ్గీ యాజమాన్యం పేర్కొంది.
రెండో ఎడిషన్‌ను ప్రకటించిన స్విగ్గీ సంస్థ
టాప్ నగరాల్లో హైదరాబాద్‌కు గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment