
మహిళలు చదువుకుంటే కుటుంబమంతా విద్యావేత్తలే
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రసూల్‌పురా: మహిళలు చదువుకుంటే కుటుంబమంతా విద్యావేత్తలుగా మారుతారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం మారేడుపల్లి కస్తూర్బాగాంధీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను గవర్నర్ ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని ప్రశంసించారు. కస్తూర్బా కళాశాల విద్యార్థులు విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో గొప్ప మైలురాళ్లు అధిగమిస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద జీవితాన్ని ప్రతి విద్యార్ధీ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సరోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment