నా కారునే ఆపుతావా..?
పంజగుట్ట: కేవలం రూ. 4 వేల పెండింగ్ చలానాలు ఉంటే నా కారునే ఆపుతావా ..? నీకు ఎంత ధైర్యం అంటూ ఓ వ్యక్తి పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించాడు. నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో నిన్ను ట్రాన్స్‌ఫర్ చేయిస్తాను అంటూ చిందులు తొక్కాడు. అంతే కాకుండా లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ఏర్పాటు చేసుకోవడం, కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు తాజ్‌కృష్ణా నుంచి మోనప్పా సర్కిల్ వైపు వస్తున్న ఫ్యాన్సీ నెంబర్‌తో ఉన్న ఓ కారును గుర్తించారు. మోనప్ప సర్కిల్ వద్ద కారును ఆపి పెండింగ్ చలానాలు చెక్ చెయ్యడంతో రూ.4 వేలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతే కాకుండా విండోస్‌కు బ్లాక్ ఫిల్మ్ కనిపించాయి. కారు నడుపుతున్న గచ్చిబౌలికి చెందిన అరీఫ్ అనే వ్యక్తిని కారు దిగాల్సిందిగా కోరారు. దీంతో ఆరీఫ్ కారు దిగుతూనే తనను ఎందుకు ఆపారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కేవలం రూ.4 వేలు పెండింగ్‌లో ఉంటే తన కారును ఆపుతారా ..?, నా ఇంట్లో ఉన్న కారుకు రూ.16 వేలు పెండింగ్ ,లానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరూ అడగలేదు, నేను తలచుకుంటే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేయిస్తాను అంటూ వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్ అతడిని అడ్డుకుని కారును పక్కకు తీయించి కారు టైర్లకు లాక్ వేశారు. అతడి వద్ద లైసెన్స్ కూడా లేనట్లు గుర్తించిన పోలీసులు కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, పెండింగ్ చలానా రూ.4 వేలు, లైసెన్స్ లేనందుకు మరో రూ.వెయ్యి చలానా విధించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు పంజగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ చేయిస్తా
రూ.నాలుగు వేలు చలానా ఉంటే అడ్డుకుంటావా?
ఇంట్లో ఉన్న కారుపై రూ.16 వేలు ఉంది
కారు విండోస్‌కు బ్లాక్ ఫిల్మ్,
లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వ్యక్తి హల్‌చల్
పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment