బంజారాహిల్స్: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. వైద్యుడి గదిలోకి వచ్చిన ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న బూట్లను ఎత్తుకెళ్లాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమాజీగూడ, యశోద ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఓ ఆగంతకుడు డాక్టర్లు వినియోగించే బీ1 సెల్లార్ నుంచి లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడ ఓ వైద్యుడి గదిలో డాక్టర్‌కు చెందిన డ్రెస్సింగ్ రూమ్ నుంచి రూ.15 వేల విలువ చేసే షూస్‌ను తస్కరించాడు. ఆస్పత్రి సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తి బీ1 సెల్లార్ నుంచి ఐదో అంతస్తుకు వెళ్లి డాక్టర్ డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ తొడుక్కుని అక్కడి నుంచి నడిచి వెళ్తున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన అతను రాజ్‌భవన్ వైపు నడిచి వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
చిల్లర దొంగ పనే
సూర్యాపేటకు చెందిన మహేష్ (22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చిన అతను సోమాజీగూడలోని దక్కన్ ఆస్పత్రిలో పని చేస్తూ ఇక్కడే హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న యశోద ఆస్పత్రి సిబ్బందితో పరిచయాలు పెంచుకుని తరచూ వచ్చి పోతుండేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రి ఐదో అంతస్తుకు వెళ్లి వైద్యుడి డ్రెస్సింగ్ రూమ్‌లో షూస్ దొంగిలించి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి గదిలో సోదాలు చేయగా ఒక ఐ–ఫోన్, ట్యాబ్‌తో పాటు షూస్ స్వాధీనం చేసుకున్నారు.
యశోద ఆస్పత్రిలో ఘటన
నేరుగా వైద్యుడి గదిలోకి వెళ్లి చోరీ
గంటల వ్యవధిలోనే నిందితుడి పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment