ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
శంకర్‌పల్లి: పిల్లల తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని దొంతాన్‌పల్లిలో ఆదివారం సక్సెస్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరాటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దానిని నిత్యం సాధన చేయడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. ఫోన్లలో సోషల్ మీడియా, టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ కరాటే ప్రతినిధులు రవీందర్ కుమార్, అనిల్, రాజు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్‌నాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment